కృష్ణ

అస్తవ్యస్తంగా రెవెన్యూస్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అర్జీలు ఫుల్.. సౌకర్యాలు నిల్.. అన్న చందాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమం తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి సోమవారం జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రతి సోమవారం స్పందనలో కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడుతున్నాయి. సోమవారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 1817 అర్జీలు వచ్చాయి. ఇందులో 71 అర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించారు. 1746 అర్జీలను నిర్ధేశించిన గడువు లోపు పరిష్కరించాల్సి ఉంది. ఒక్క కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలోనే సుమారు 350 పై బడి అర్జీలు వచ్చాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ జరిగే స్పందన కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారు. దీంతో అర్జీదారులంతా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలోనే అర్జీలు ఇచ్చేందుకు మక్కువ చూపుతారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ అర్జీదారులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. గత ప్రభుత్వం మీకోసం పేరుతో నిర్వహించగా ప్రస్తుత ప్రభుత్వం స్పందనగా పేరు మార్చింది. అయితే స్పందనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటంతో అర్జీదారుల సంఖ్య వారం వారం పెరుగుతూ వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సకల సౌకర్యాలు కల్పించి అర్జీదారులను సంతృప్తిగా పంపాలన్నారు. అయితే ఈ ఆదేశాలు కలెక్టరేట్‌లో ఏ మాత్రం అమలు కాని పరిస్థితి. అర్జీదారులకు తగు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విపలమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తమ అర్జీలను రిజిస్ట్రేషన్ చేయించుకునే తొలి అంకం నుండి అధికారులకు ఆ అర్జీలను ఇచ్చే తుది అంకం వరకు అర్జీదారులకు పలు ఇక్కట్ల పాలవ్వక తప్పదు. నిలబడేందుకు నిలువ నీడ లేక చెట్లు, పుట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. చిత్త అగ్గికి తాళలేక పలువురు కలత చెందినప్పటికీ ఎక్కడా కూడా ఫస్ట్ ఎయిడ్ కనిపించలేదు. అలాగే అర్జీల నమోదులో క్రమపద్ధతి లేకుండా పోయింది. ఒక విధానమంటూ లేకుండగా అర్జీదారులు గుంపులు గుంపులుగా అర్జీల నమోదుకు ఎగబడాల్సి వచ్చింది. అలాగే సంబంధిత అర్జీలను ఆన్‌లైన్ చేయడంలో కూడా పొరపాట్లు దొర్లాయి. పరిష్కార అధికారి ఒకరైతే మరొక అధికారి పేరుతో అర్జీలను ఆన్‌లైన్ చేశారు. వాటిని తీసుకుని అధికారులకు సమర్పించగా అధికారులు తిరిగి మళ్లీ రిజిస్ట్రేషన్ కౌంటర్‌కు పంపారు. దీంతో పలుమార్లు అర్జీదారులు అటూ ఇటూ తిరగాల్సి వచ్చింది. ఇలా అనేక అసౌకర్యాల మధ్య సోమవారం నాటి స్పందన కార్యక్రమం ముగిసింది.