కృష్ణ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : మొవ్వ, పమిడిముక్కల, ఘంటసాల మండలాల్లో పాముకాటు బాధితులకు అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆరా తీశారు. వైద్య సహాయం అంద చేస్తున్న మొవ్వ పీహెచ్‌సీ వైద్యుల సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడారు. డాక్టర్ శొంఠి శివరామకృష్ణ కృషిని ప్రశంసించారు. సోమవారం ఒక్క రోజునే ఆరుగురు బాధితులకు అందించిన వైద్య సహాయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాము కాటు నివారణ మందును సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే అదనంగా స్టాకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ శివరామకృష్ణకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉదయ భాస్కరరావు, చల్లపల్లి సీఐ వెంకట నారాయణ, డాక్టర్ భగవాన్, తహశీల్దార్ జి రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు.