కృష్ణ

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషసర్పాల భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పాముల భయం పట్టుకుంది. ఇప్పటి వరకు దివిసీమ ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురి చేసిన పాములు ఇప్పుడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటున్న రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం ఉదయం ఆస్పత్రిలో ఇరువురు పాము కాటుకు గురయ్యారు. ఒకరు ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు కాగా మరొకరు ఆస్పత్రి క్యాంటీన్‌లో పని చేస్తున్న ఓ మహిళ కుమార్తె కావడం విశేషం. పదేళ్ల నాగ రమ్య ఆదివారం రాత్రి తన తల్లి వద్దకని ఆస్పత్రిలోని క్యాంటీన్‌కు వచ్చింది. ఆ సమయంలో ఏదో విష సర్పం కాటు వేసినట్లు గుర్తించిన తల్లి వెంటనే ఆస్పత్రి వైద్యులకు చూపించారు. విష పురుగు భావించిన వైద్యులు ఎందుకన్నా మంచిదని పాము కాటు విరుగుడు మందు ఇచ్చారు. ఈ ఘటన మరువక ముందే సోమవారం తెల్లవారు జామున ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు అయిన ఎంవిఎస్ నాయుడు ఆస్పత్రి వెనుక వైపు పశువులు రావటంతో తోలేందుకు వెళ్లాడు. ఈ సమయంలో అతను కూడా పాము కాటుకు గురయ్యాడు. ప్రథమ చికిత్స అనంతరం అతన్ని విజయవాడ తరలించారు. ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆర్‌ఎంఓ డా. భాస్కర కుమార్ తెలిపారు.

మా సహకారం లేకుంటే వ్యవస్థకు నష్టాలే

గుడివాడ, జూలై 22: జిల్లాలో సహకార వ్యవస్థ బలోపేతం కావడానికి పాలకవర్గాల సమర్థ పనితీరే కారణమని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఏలూర్ రోడ్డులోని కొలుసు సుబ్బారావు ఫంక్షన్ హాల్‌లో కృష్ణా జిల్లా కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిన్నమనేని మాట్లాడుతూ సహకార వ్యవస్థ పాలకవర్గాల చేతుల్లో లేకపోతే నష్టాల బారిన పడతాయన్నారు. సహకార సంఘాల ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాల కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. నూరు శాతం వసూళ్ళు సాధించిన సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఎన్ రంగబాబు, జీఎం చంద్రశేఖర్, డైరెక్టర్లు విజయ్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

24 గంటల్లోనే సీఎం సహాయం అందజేత

కూచిపూడి, జూలై 22: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి 24 గంటల్లోగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.7లక్షలు పరిహారంగా అందచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు రూ.7లక్షలు అందచేయటం ఇదే ప్రథమమని కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. మొవ్వ పెడసనగల్లు గ్రామానికి చెందిన కొనకళ్ల విజయ్ కుమార్ (52) పమిడిముక్కల మండలం పెనమకూరులో ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని చెరకు పంటలో నష్టం సంభవించటంతో అప్పులు బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ సమాచారం తెలుసుకున్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సమాచారాన్ని తక్షణమే కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.7లక్షలు మంజూరు చేశారు. ఆ చెక్కును సోమవారం కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేతులు మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్, పక్కా గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జె ఉదయ భాస్కర్, మొవ్వ తహశీల్దార్ జక్కా రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడీ టి మోహనరావు, మొవ్వ ఎడీఎ, ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎఓ కె శివప్రసాద్, శాంత, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు, మురళీ, ఏనుగు మోహనరావు, రాజులపాటి మురళీ తదితరులు పాల్గొన్నారు.