కృష్ణ

నిర్లక్ష్యం వల్లే తారకరామ అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు : గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తారకరామ ఎత్తిపోతల పథకం అస్తవ్యస్తంగా ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జి. కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి తారకరామ పథకం పంప్‌హౌస్‌లను సందర్శించారు. అక్కడి మోటార్ల పనితీరు, కాలువలను స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందిని విచారించి నీటిని ఎత్తిపోస్తున్న వైనాన్ని తెలుసుకున్నారు. అనంతరం వసంత మాట్లాడుతూ కొనే్నళ్ళుగా నిర్వహణ సరిగా లేనందున పథకం నిర్వీర్యమైందన్నారు. మోటార్లు కూడా రిపేర్లలో ఉన్నాయన్నారు. మొదటి పంప్‌హౌస్ వద్ద చెప్పటానికి వీలులేని దారుణమైన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులతో కలసి పరిశీలించామన్నారు. కాంట్రాక్టర్లను కూడా తీసుకువచ్చి యుద్ధప్రాతిపదికన పనులు చేయించడానికి చర్యలు చేపట్టామన్నారు. రెండురోజుల్లో మొదటి పంప్‌హౌస్ కింద రెండు మోటార్లకు మరమత్తులు చేసి, పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రెండవ పంప్‌హౌస్ కింద కూడా పని చేపట్టనున్నట్లు తెలిపారు. మూడవ పంప్‌హౌస్‌లో రెండు మోటార్లు పనిచేస్తున్నాయన్నారు. మొత్తం కుడికాలువ కింద 14వేల ఎకరాల ఆయకట్టు ఉందని కనీసం 12వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నూరుశాతం పనిని పూర్తి చేస్తామన్నారు. ఏనాడో పెట్టిన పథకంలోని మోటార్లు తుప్పుపట్టి దీనావస్థలో ఉన్నాయని, వీటికి సుమారు రూ.కోటిన్నర వరకూ శాశ్వత మరమత్తులకు ఖర్చవుతుందన్నారు. దీనికి కూడా నిధులు మంజూరు చేయించి రైతులకు తారకరామ పథకం ఫలాలను అందిస్తానని ఎమ్మెల్యే వసంత హామీ ఇచ్చారు. మాజీ ఎఎంసి చైర్మన్ పులిపాక థామస్, జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, పజ్జూరు శ్రీకాంత్, గొట్టుముక్కల ఓంకార్, పసుపులేటి రమేష్, బెజవాడ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
తలగడదీవి హైస్కూల్ అభివృద్ధికి కృషి
* ఎమ్మెల్యే సింహాద్రి రమేష్
నాగాయలంక, ఆగస్టు 13: మండల పరిధిలోని తలగడదీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వౌలిక వసతుల క ల్పనకు శక్తివంచన లేకుండా కృషి చే స్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బా బు అన్నారు. మంగళవారం ఆ పాఠశా ల అదనపు గదులలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమా జం అభివృద్ధి చెందేందుకు సాధ్యమవుతుందన్నారు. తదనుగుణంగా ప్రభు త్వం పాఠశాలల వౌలిక సదుపాయాలను కల్పించటం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తోందన్నారు. తాను ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చై ర్మన్ వర్రే రాంబాబు, హెచ్‌ఎం పింగళి లలిత రత్నకుమారి, ఎంఇఓ టివిఎం రామదాసు, శ్యాప్ సెక్రటరీ శేషగిరిరావు, వైసీపీ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.