కృష్ణ

కేడీసీసీ వార్షిక రుణ లక్ష్యాన్ని అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1688కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జ్, జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కేడీసీసీ బ్యాంక్‌లో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై బ్యాంక్ అధికారులతో సమీక్షించారు. రూ.1688కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ.961కోట్ల మేర లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. బ్యాంక్ అధికారులు బ్యాంక్ అభివృద్ధితో పాటు రైతులు, మధ్య తరగతి ప్రజలకు పరపతి సౌకర్యం కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రస్తుతం రూ.1987 కోట్లకు బ్యాంక్ డిపాజిట్లు చేరాయన్నారు. బ్యాంక్ డిపాజిట్ల సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ శాఖల నుండి డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక వ్రద్ధ వహించాలన్నాలన్నారు. రైతులు, కౌలు రైతులకు సహకార బ్యాంక్‌ల ద్వారా పంట రుణాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు లక్ష్యాన్ని అధిగమించి పంట రుణాలు అందించడం జరుగుతుందన్నారు. 2018-19 సంవత్సరంలో 1,34,632 మందికి రూ.1127కోట్లు పంట రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. 2019-20 సంవత్సరంలో 89,208 మందికి రూ.1091 కోట్లు పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 44,457 మందికి రూ.273 కోట్లు పంట రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన కొత్త వారికి సహకార సంఘాల నిర్వహణ, పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఎన్‌వి ఆనందబాబు, కేడీసీసీ బ్యాంక్ సీఇఓ ఎన్ రంగబాబు, బ్యాంక్ జనరల్ మేనేజర్ బిఎల్ చంద్రశేఖర్, ఎ శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

కుళ్లిపోయిన వాణిజ్య పంటలు
* వరద ఉధృతి తగ్గడంతో బయటపడుతున్న పంటపొలాలు
తోట్లవల్లూరు, ఆగస్టు 19: గత ఐదు రోజులుగా ఉధృతంగా ప్రవాహంచిన కృష్ణమ్మ సోమవారానికి శాంతించింది. ఉగ్రరూపం దాల్చి గ్రామాలు, పంట పొలాలను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. అయినా మండలంలోని ఎనిమిది లంక గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. రహదారులపై నీరు ప్రవాహిస్తుండటంతో రాకపోకలు మెరుగుపడలేదు. సోమవారం ఉదయం నుంచి వరద తీవ్రత తగ్గటంతో గ్రామాల్లోకి చొచ్చుకుని వచ్చిన నీరు ఇప్పుడిప్పుడే వెనకడుగు వేస్తోంది. మండలంలోని వేలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు మాత్రం వరద ముంపులోనే ఉండి నానుతున్నాయి. వరద నీరు ఎక్కువ రోజులు పంట భూముల్లో ఉండటం వల్ల పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మండలంలోని లంకల్లో సాగవుతున్న తమలపాకు, అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసిన రైతులు, కౌలు రైతులు భారీ నష్టానికి గురయ్యారు. వరద తాకిడికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.