కృష్ణ

వరద ముంపు ప్రాంతాల్లో నేడు చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరద ముంపు బాధితులకు బాసటగా చంద్రబాబు పర్యటన సాగనుంది. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్ర పర్యటన చేసి బాధితులకు అండగా నిలబడనున్నారు. ఉదయం 11.45ని.లకు గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. 12గంటలకు భోజన విరామం అనంతరం 12.30ని.లకు విజయవాడ బెంజి సర్కిల్ నుండి స్క్యూ బ్రిడ్జి-గీతానగర్ మీదుగా 1.30ని.లకు కరకట్ట దగ్గర నిర్మించిన గోడను పరిశీలించనున్నారు. 2గంటల నుండి ఆయన పర్యటన కరకట్ట మీదుగా ప్రారంభం కానుంది. 2.15ని.లకు పెనమలూరు మండలం పెదపులిపాక, కాపరనేనివారిపాలెం, 3గంటలకు తోట్లవల్లూరు, 4గంటలకు ఘంటసాల మండలం శ్రీకాకుళం, 5గంటలకు చల్లపల్లి మండలం నడకుదురు, రాముడిపాలెం, కె.కొత్తపాలెం, 5.30ని.లకు మోపిదేవి, పులిగడ్డ చేరుకుంటారు. వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించటంతో వరద బాధితులన ఆయన పరామర్శించనున్నారని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో నాలుగు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నట్లు తెలిపారు.

ముందు చూపు లేకనే ముంపు
*ఎగువ రాష్ట్రాలు వరద హెచ్చరికలు చేసినా పట్టించుకోని జగన్ * మాజీ ఉపసభామతి బుద్ధప్రసాద్ విమర్శ
అవనిగడ్డ, ఆగస్టు 19: రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేదని, వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. సోమవారం వరద ముంపుకు గురైన ఎడ్లలంక, దక్షిణచిరువోలులంక గ్రామాలతో పాటు దివిసీమలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సమగ్ర నీటి నిర్వహణ జగన్ ప్రభుత్వం వల్ల కాలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముందు చూపు లేకపోవడమే విపత్తుకు కారణమన్నారు. రివర్స్ టెండర్ల చుట్టూ అధికారులు, చంద్రబాబు చుట్టూ మంత్రులు తిరగడం తప్పితే నదీ పరివాహక ప్రాంతాలను వరద ముంపుకు గురి చేశారన్నారు. జూలై 20వ తేదీ తర్వాత రాష్ట్రానికి వరదలు వస్తాయని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినా జగన్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఫలితంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండలి రాజా, గాజుల మురళీకృష్ణ, కె వెంకటేశ్వరరావు, మండలి వెంకట రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.