కృష్ణ

‘వరద’ నష్టం అపారమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లాలో ‘వరద’ సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. ప్రాథమిక నష్టం అంచనాలను తయారు చేసిన జిల్లా అధికార యంత్రాంగం నేటి నుండి పూర్తి స్థాయి నష్టం అంచనాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ నేతృత్వంలో నష్టం అంచనాల తయారీకి శాఖల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మంగళవారం నుండి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పూర్తి స్థాయి నష్టం అంచనాలను తయారు చేయనున్నారు. 14 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అత్యధికంగా వాణిజ్య పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 4,876.66 హెక్టార్లలో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లగా 4,139 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. 66 హెక్టార్లలో మల్బరీ సాగు, 90 మల్బరీ షేడ్లకు నష్టం వాటిల్లింది. వాణిజ్య పంటల్లో అధికంగా అరటి, ప్రత్తి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, కూరగాయల పంటలు ఉన్నాయి. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు మండలాల్లో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిరప, పెసర, మినుము వంటి పంటలు 4,139 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఉద్యానవన శాఖకు సంబంధించి 7,151 మంది రైతులకు చెందిన 4,876.66 హెక్టార్లలో రూ.961.09లక్షలు విలువైన పంటను రైతులు కోల్పోవల్సి వచ్చింది. చల్లపల్లి, ఘంటసాల మండలాల్లోనే మల్బరీ సాగు వరదకు నష్టపోయినట్లు గుర్తించారు. మూడు దశల్లో పంట నష్టం అంచనాలు వేయనున్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నష్టం అంచనాలు తయారు చేయనున్నారు. గ్రామ స్థాయి కమిటీలో ఎఇఓ, వీఆర్‌ఓ, రైతుమిత్ర గ్రూపు సభ్యులు, మండల స్థాయి కమిటీలో తహశీల్దార్, ఎంపీడీవో, అగ్రికల్చర్ ఆఫీసర్, సబ్ డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్డీవోలు సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రత్యేక ఫార్మెట్‌లో పంట నష్టాలను నమోదు చేయనున్నారు.