కృష్ణ

వరద బాధితులందరినీ ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): కృష్ణానది ఉగ్రరూపం కారణంగా నిరాశ్రుయులైన వరద బాధితులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. వరద బాధితులకు తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులను అందిస్తున్నామన్నారు. బాధితులకు సహాయార్థం దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం గ్రామస్థాయి నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలతలు టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ముంపుప్రాంతాల్లో అర్హత గల కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పామ్‌ఆయిల్, కేజీ కందిపప్పు తక్షణం అందించాలన్నారు. అర్హతలేని ఏ ఒక్క కుటుంబానికి సహయం అందకూడదని అధికారులను హెచ్చరించారు. వరద వస్తున్నప్పుడు బాధితులకు పునరావస కేంద్రాలకు తరలింపు, కేంద్రాలలో వౌలికవసతుల కల్పన వంటి పలు అంశాలలో అధికారులు బాగా పని చేశారని కితాబు ఇచ్చారు. జిల్లాలో వరద వచ్చిన ప్రాంతాలలో 103 చౌకధరల దుకాణాలు ఉన్నాయని ఇప్పటి నుండే బాధితులకు 25 కేజీల బియ్యం పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 50 చౌకధరల దుఖాణాల్లో స్టాక్ ఇప్పటికే అందుబాటులో ఉందన్నారు. మిగిలిన దుకాణాలకు అతిత్వరగా సరుకు అందుబాటులోనికి వస్తుందన్నారు. వరద నీరు వచ్చిన గృహాలను మాత్రమే గణన చేయాలని ఆయన అధికారులకు సూచించారు. లంక గ్రామాలకు నీరు చుట్టుముట్టిందని ఆ గ్రామాలకు ప్రత్యేకంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు.
దాతలు కదిలి రావాలి
వరద బాధితుల సహాయార్థం దాతలు ముందుకురావాలని కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ స్వచ్ఛంధ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోటరిక్లబ్ క్లాత్ మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వరదబాధితులకు సహాయంపై కలెక్టర్ ఇంతియాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదిపరివాహక ప్రాంతంలో కృష్ణానదికి వరదలు కారణంగా అనేక గ్రామాలు, లంకలు ముంపునకు గురి అయ్యాయన్నారు. జిల్లాలోని 19 మండలాల్లోని 46 గ్రామాల్లో వరద తాకిడికి గురి కావడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా బాధితులకు జిల్లాలో 49 ప్రత్యేక పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 13 వేల 450 మందికి పైగా, నగరపాలక సంస్థ పరిధిలో 13 పునరావాస కేంద్రాలలో 7 వేల 800 మంది బాధితులకు పునరావాసం కల్పించాలన్నారు. బాధితులకు ఆహారపదార్థాలు కాకుండా వారికి దుప్పట్లు, చీరలు, లుంగీలు, దోమతెరలు, తువ్వాళ్లు వంటి వస్తువులను అందిస్తే బాగుంటుందని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు పుస్తకాలు, స్కూలు బ్యాగ్‌లు వరద నీటికి తడిచిపోయాయని అటువంటి వాటిని కూడా అందించవచ్చునన్నారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థతిని మెరుగుపరిచేందుకు దోహదపడుతుందన్నారు. బాధితుకలు అవసరమైన వస్తువులు సంబంధిత తహళీల్ధార్లు గుర్తించి ఆ జాబితాలను అందిస్తారని ఆమేరకు సహాయం చేసేందుకు స్వచ్ఛంధ సంస్థలు ముందుకురావాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఏవిడి నారాయణరావు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహనరావు, రోటరిక్లబ్ అధ్యక్షుడు పి అనీల్‌బాబు, పలు స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ మండల తహశీల్ధార్లు, తదితరులు పాల్గొన్నారు.