కృష్ణ

దుర్గమ్మ గుడి వద్ద వాహనాల మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై స్పైన్స్ అమరుస్తున్న సందర్భంగా వాహనచోదకులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ఈనెల 21వ తేదీ నుంచి రెండురోజుల పాటు అమ్మవారి గుడి రెండు వైపుల వాహనాల రాకపోకలు మళ్లిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు పేర్కొన్నాయి. 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 8 గంటల వరకు గుడి మీదుగా కుమ్మరాపాలెం వైపు కుమ్మరిపాలెం వైపు నుంచి విజయవాడకు ఎలాంటి వాహనాలు అనుమతించబడవు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి వై జంక్షన్ మీదుగా నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలు ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డు మీదుగా సితారా సెంటర్, చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్, మిల్క్ ప్రాజెక్టు, చిట్టినగర్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు. అలాగే విజయవాడ వైపు నుంచి కుమ్మరిపాలెం వైపు వెళ్లే వాహనాలు మార్కెట్, పంజాసెంటర్, కెబిఎన్ కళాశాల, చిట్టినగర్, గొల్లపూడి వై జంక్షన్ మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది. కనకదుర్గ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల సందర్భంగా పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలను ప్రజలు, వాహన చోదకులు గమనించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌గా సంతోష్
లబ్బీపేట, ఆగస్టు 20: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్‌గా పిహెచ్‌ఆర్‌ఎస్ సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. కృష్ణాజిల్లాలో మొత్తం 121 ప్రభుత్వ, కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు అయ్యాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో ఒకటైన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ పథకం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబానికి 50వేల వరకూ సాయం అందుతుందని కో ఆర్డినేటర్ చెప్పారు. జిల్లాలోని అర్హులందరూ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు అందించే ఆరోగ్య శ్రీ సేవలలో హాస్పిటల్ యాజమన్యం అలసత్వం వహిస్తే కఠినమైన చర్యలతో పాటు హాస్పిటల్ నమోదును రద్దు జరుగుతుందన్నారు. నిరంతరం ఆరోగ్య శ్రీ సేవలను 24గంటలు ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం జిల్లా కోర్డినేటర్ 8333814009, జిల్లా మేనేజర్ నవీన్ 8333814010, తదితరులు అందుబాటులో ఉంటారని తెలిపారు.