కృష్ణ

జిల్లాలో రూ. 20 కోట్ల పంట నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ) : జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపిన వరదల తాకిడికి సుమారు 20కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 4395 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖఘ జాయింట్ డైరెక్టర్ తాళ్ళూరు మోహన్‌రావు మంగళవారం తెలిపారు. ఇందులో వరి పంట ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయశాఖ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పంట నష్ట అంచనాలను రూపొందించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. గ్రామాలు, మండలాల ప్రాతిపదికన పంట నష్టం అంచనాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఉద్యానవన పంటలకు రూ. 10కోట్లు నష్టం
కృష్ణానదికి వచ్చిన భారీ వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉద్యానవన పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేసిన అరటి, పసుపు పంటలు వరదల తాకిడితో భారీగా నష్టపోయాయి. జిల్లా వ్యాప్తంగా 4860 వేల హెక్టార్లలో హార్టీకల్చర్ పంటలకు నష్టం కలిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు హర్టీకల్చర్ డీడీ రవికుమార్ మంగళవారం తెలిపారు. వరద తాకిడి ఎక్కువగా ఉన్న 12 మండలాల్లోని అరటి, పసుపుతో పాటు మరికొన్ని పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పారు. వీటి విలువ రూ. 9 కోట్ల 60 లక్షల రూపాయలుగా ఉన్నట్లు తెలిపారు. వరదలు తగ్గిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ పంట నష్టలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంటలను గుర్తించి, పూర్తి స్థాయి పంట నష్టానికి సంబంధించిన నివేదికలను త్వరలోనే రూపొందిస్తామన్నారు.