కృష్ణ

దేవదాసీ వ్యవస్థ సమాజానికి మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దేవదాసీ వంటి సాంఘిక దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగడం రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. నగరంలో జరుగుతన్న దేవదాసీ వ్యవస్థ ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ 1988లో దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు చట్టం వచ్చిందన్నారు. అయినా ఇప్పటికీ ఆంధ్రా, తెలంగాణల్లో 80వేల మంది ఈ సాంఘిక దురాచార వ్యవస్థలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు ఆయా జిల్లాలో మాతంగి, దేవదాసీ, జోగినీలు ఉన్నారంటే దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడమేనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దేవదాసి వ్యవస్ధను రూపుమాదేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. సతీసహగమనం, బాల్య వివాహాల వంటి దురాచారాలు రూపుమాపిన నేపథ్యంలో అలాంటి జోగినీ, దేవదాసీలను రూపుమాపడం అసాధ్యం కాదన్నారు. అవసరమైతే ఇప్పుడున్న జీవోలను చట్టాలుగా తెస్తామన్నారు. చదువు లేకపోవడం తదితర కారణాలతో దేవదాసీలు ఇంకా సమాజంలో కొనసాగుతున్నారన్నారు. దేవదాసీల పిల్లలకు గురుకులంలో ఉచితంగా చదువుకునేందుకు సీట్లు ఇవ్వడంతోపాటు ఈ వ్యవస్థలో మగ్గే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఆరుమాసాలకు ఒకసారి దేవదాసీ వ్యవస్థపై తీసుకుంటున్న చర్యలపై సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ధైర్యంగా దేవదాసి పిల్లలను వివాహం చేసుకోవడం, అనేక సమస్యలు ఎదుర్కొంటున్న భాస్కర్ అనే వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో 80వేల మంది దేవదాసీలు ఉన్నారన్నారు. చట్టాలు బలంగా ఉన్నా నిర్మూలనకు చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్ధలోకి ఎక్కువగా సమాజంలో అట్టడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల వారే ఉండటం దురదృష్టకరమన్నారు. దేవుడి పేరుమీద అరాచకాలు కొనసాగడం విచారకరమన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఎస్సీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి, వైఎస్ చైర్మన్ గంధం చంద్రుడు, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు కృపాసాగర్, వన్‌మ్యాన్ కమిషన్ అధ్యక్షుడు రఘునందన్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి చల్లప్ప, దేవదాసి అక్కలు వివిధ జిల్లాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.