కృష్ణ

నేర నియంత్రణపై దృష్టి సారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : నేర నియంత్రణపై దృష్టి సారించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బందరు, అవనిగడ్డ డివిజన్‌లకు సంబంధించి నేర సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. బెట్టింగ్‌లు, కోడి పందాలు, గుట్కా, గంజాయి అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా పోలీసు సేవలు అందించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కార చర్యలు చూపాలన్నారు. ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పందనలో వచ్చే అర్జీలను కూడా అక్కడిక్కడే పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ మరింత ముమ్మరం చేయాలన్నారు. అనుమానితుల సంచారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి శనివారం ప్రమాద రహిత దినాన్ని పాటించి రోడ్డు ప్రమాదాలను పెద్ద ఎత్తున తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు కేడీలు, డీసీలను తరుచుగా చెక్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, బందరు, అవనిగడ్డ డీఎస్పీలు మొహబూబ్ బాషా, రమేష్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, బందరు, అవనిగడ్డ సబ్ డివిజన్‌ల పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.