కృష్ణ

భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ఇసుక పాలసీ పేరుతో గడిచిన మూడు నెలలుగా తమకు పనీ లేకుండా చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. జిల్లాలో ఉన్న ఇసుక క్వారీలను తెరిపించి ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో గురువారం నగరంలో భారీ నిరసన ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణంలోని వివిధ రంగాలకు చెందిన వేలాది మంది కార్మికులు ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ ఆందోళనలో పాల్గొన్నారు. ఇసుక కొరత అన్ని వర్గాల మీద పడిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఇసుక విధానం పేరుతో ఇన్ని ఇబ్బందులు పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఉన్న అన్ని ఇసుక క్వారీలను తెరిపించి ఇసుక కొరతను అధిగమించి భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిథులు మురళీకృష్ణ, మురళీధర్, ఎల్‌వి స్వామి, కృష్ణ, పి రాజు, భద్రం, నాగరాజు, బూర సుబ్రహ్మణ్యం, అందె శ్రీనివాసరావు, దుర్గారావు, సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.