కృష్ణ

సముద్ర మొగ పూడిక తీయించరూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : మేట వేసుకుపోయిన గిలకలదిండి సముద్ర ముఖం ద్వారాన్ని (మొగ) పూడిక తీయించాలని మచిలీపట్నం మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని కలిసి విన్నవించారు. సముద్ర ముఖ ద్వారం మేట వేసుకుపోవడం వల్ల బోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. బోట్ల అడుగు భాగం దెబ్బతిని తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బందరు నియోజకవర్గంలో చేపల వేట వృత్తిపై జీవిస్తున్న సుమారు 2వేల మందికి పైగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని మత్స్య శాఖ కమీషనర్‌కు లేఖ వ్రాసి ఇసుక మొగ పూడికతీత పనులు చేయించాలని కోరారు. అలాగే ఆటో కార్మికులపై అన్యాయంగా విచ్చలవిడిగా విధిస్తున్న ఈ-చలానా జరిమానాలు రద్దు చేయాలని, ఆటోలకు అనువైన పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఎం సుధాకరరావు, కె నాంచారయ్య తదితరులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని ఎస్‌ఎన్ గొల్లపాలెం గ్రామం ఎస్‌సీ కాలనీలో మంచినీటి పైపులైన్లు వేయించి తాగునీటి ఇబ్బందులను తొలగించాలని కోరుతూ గ్రామస్థులు ఎం నాంచారయ్య తదితరులు మంత్రికి విన్నవించుకున్నారు. బందరు మండలం సుల్తానగరం గ్రామంలోకి బస్సులు రావడం లేదని, హైవే వద్ద ఆపడం లేదని, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థుడు కె దుర్గాప్రసాద్ అర్జీ అందజేశాడు. గిలకలదిండికి చెందిన తమ్ము యోగేశ్వరరావు తన బోటు వాతావరణం అనుకూలించక జూలై 7వ తేదీన సముద్రంలో తిరగబడిందని, దానిని ఇతర బోట్ల సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చినప్పటికీ బోటులో ఆయిల్ ట్యాంకర్లు, వలలు, బోటు సామాన్లు మొత్తం సముద్రంలో కొట్టుకుపోయాయని, మరలా బాగు చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు తీర్పు హర్షనీయం
- మున్సిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటరు) : పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో హైకోర్టు తీర్పును ప్రభుత్వం స్వాగతించి తక్షణమే పనులను ప్రారంభించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా ప్రసాద్ మాట్లాడుతూ పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించడం శుభ పరిణామమన్నారు. నవయుగ హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును కూడా రద్దు చేసిందని, ఇది దుర్మార్గమైన చర్య అని బాబా ప్రసాద్ ఆరోపించారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించే విధంగా పాత టెండర్లను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు ద్వారా పోలవరం పనులు నవయుగవ సంస్థ కొనసాగించటం హర్షణీయమన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో ప్రయోగాలు వద్దని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు నుండో చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పుతో పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, ప్రజల విశ్వాసం నిజమైందని, విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. అలాగే బందరు పోర్టును కూడా నవయుగ కంపెనీకి చంద్రబాబు నాయుడు అప్పగిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ కాంట్రాక్టును రద్దు చేయడం దుర్మార్గమన్నారు. బందరు పోర్టు పనులు త్వరగా ప్రారంభించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, బత్తుల రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.