కృష్ణ

మళ్లీ ఓటరు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పుల కోసం ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాలోని పేర్లతో బాటు కొత్త వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు మళ్లీ అవకాశం వచ్చింది. ఈ సారి క్షేత్రస్థాయిలో మాత్రం ఓటర్ల జాబితాను పకడ్బందీగా సర్వే చేయించాలని నిర్ణయించింది. త్వరలో జరగనున్న పురపాలక, పంచాయతీ ఎన్నికలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం పోర్టల్‌లో అవకాశం కల్పించింది. ఆగస్టు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అలాగే క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాల్లో కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే వెలుసుబాట కల్పించింది. దీనికి సంబంధించి అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్వో)లకు కూడా అవగాహన కల్పించారు. నూతనంగా ఎన్నికల సంఘం చేస్తున్న ఈ నమోదు ప్రక్రియకు స్వీప్ అనే పేరును కూడా పెట్టారు.
అన్నింటికీ ఇప్పుడే అవకాశం
ఎన్నికల సంఘం చేపట్టిన స్వీప్‌లో ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు, సాంకేతిక సమస్యలతో పోటో మారినా, ఓటర్ల పేరు జాబితా నుండి తొలగింపు, చిరునామా మార్పు, ఇంటి పేరు మార్పు, నియోజకవర్గం మార్పు, అభ్యంతరాల స్వీకరణ ఇలా ఓటు హక్కుకు సంబంధించి ఉన్న అన్నింటికీ మార్పులు చేర్పులను ఈ స్వీప్ ద్వారా చేసుకోనే అవకాశం ఉంది. అలాగే 2020 జనవరి 15వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో మంది ఓటు హక్కు గల్లంతయ్యాయి. ఈ సారి పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమయింది. అలాగే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతీ వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి బీఎల్వో క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న ఓటరు పేరు నమోదు, అనర్హుల పేర్లు తొలగింపు ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 15 వరకు కొనసాగనుంది.
దశల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ
ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి కె విజయానంద్ స్పష్టమైన మార్గదర్శకాలతో షెడ్యూల్ విడుదల చేశారు, దీని ప్రకారం ఈ ప్రక్రియ ఆగస్టు 30 తేది వరకు జరగనుంది. సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైతే మళ్లీ దరఖాస్తులను బీఎవ్వోలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీ నుండి ఆక్టోబర్ 15వ తేదీ వరకు పోలింగు స్టేషన్ల మార్పు, ఎన్నికల కేంద్రాల గుర్తింపు, బూత్ స్థాయి అధికారుల నుండి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి సాధారణ ఓటర్ల జాబితా ప్రచురణ కార్యక్రమం మొదలవుతుంది. అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబరు 30వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యర్థనలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 15వ తేదీ నుండి దరఖాస్తులు, అభ్యర్థనల పరిశీలన, డిసెంబర్ 25వ తేదీన ఓటర్ల జాబితా చివరి ప్రచురణ జరగడంతో పాటు 2020 జనవరి 1 తేదీ నుండి 15వ తేదీ వరకు అధికారిక ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుంది.
కొత్త ఓటు నమోదుకు మంచి అవకాశం
2020 జనవరి 15 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నమోదు కోసం స్వీప్ కార్యక్రమం మంచి అవకాశం. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్లు ఫారం 6తో పాటు ఒక పాస్‌పోర్టు సైజ్ ఫోటు జత చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వారంలో ఒక రోజు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆల్‌లైన్‌లో కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. సీఈవో ఆంధ్రా.కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎవ్వోలు విచారణ జరిపి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పిస్తారు. వీటితో పాటు ఓటర్ల సవరణ, మార్పులు చేర్పుల కోసం ఫారం 7, 8, 8ఏ, లను కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓటు హక్కు నమోదు కోసం పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. మోబైల్ యాప్ హెల్ప్‌లైన్ ద్వారా కూడా ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.