కృష్ణ

‘కొలువు’ల పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : కొలువుల పరీక్షలు తరుముకొస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క సచివాలయం ద్వారా 11 కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 2లక్షల 655 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్షకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 374 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 26 మండలాల పరిధిలో పరీక్షా కేంద్రాల గుర్తింపు జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌గా పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రోజైన సెప్టెంబర్ 1వతేదీన జరిగే రాత పరీక్షకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరు కానున్నారు. లక్షా 41వేల 805 మంది అభ్యర్థులు హాజరు కానుండగా ఉదయం జరిగే పరీక్షకు లక్షా 14వేల 128 మంది, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 27వేల 677 మంది హాజరు కానున్నారు. రెండవ రోజైన 3వతేదీన జరిగే పరీక్షకు 22,919 మంది హాజరు కానుండగా ఉదయం 16,243 మంది, మధ్యాహ్నం 6,676 మంది హాజరు కానున్నారు. మూడవ రోజైన 4వతేదీన జరిగే పరీక్షకు మొత్తం 2,499 మంది హాజరు కానుండగా ఉదయం 1839 మంది, మధ్యాహ్నం 660 మంది హాజరు కానున్నారు. నాల్గవ రోజైన 6వతేదీన జరిగే పరీక్షకు 1643 మందికి గాను ఉదయం 1176 మంది, మధ్యాహ్నం 467 మంది హాజరు కానున్నారు. ఐదవ రోజైన 7వతేదీన జరిగే పరీక్షకు 18,527 మందికి గాను ఉదయం 14,550 మంది, మధ్యాహ్నం 4977 మంది, చివరి రోజైన 8వతేదీన జరిగే పరీక్షకు 12,262 మందికి గాను ఉదయం 7,613 మంది, మధ్యాహ్నం 4,649 మంది పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు గాను 374 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 229 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 374 మంది సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు, 100 మంది రూట్ ఆఫీసర్లు, 49 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ల వద్ద హెల్ప్ డస్క్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కూడళ్ల వద్ద రూట్ మ్యాప్‌లను కూడా ప్రదర్శించనున్నారు. విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. 0866-5139370 నెంబర్ ద్వారా అభ్యర్థులు ఎటువంటి సలహాలు, సందేహాలైనా నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు.