కృష్ణ

శతాధిక వృద్ధుడికి ‘శతమానంభవతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు : పామర్రు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు ప్రాతూరి దుర్గా ప్రసాదరావు ఆదివారం నిండు నూరేళ్లు ఆయుషును పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వారి సహధర్మచారిణి సావిత్రితో కలిపి స్థానికంగా ఉన్న వారి స్వగృహ ప్రాంగణంలో శత వర్ష భాగ్యోప జీవన సాఫల్యోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అరుదైన ఈ శతమానంభవతి శతాయుషు పురుషేంద్ర కార్యక్రమాన్ని తిలకించడానికి దుర్గాప్రసాదరావు మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు అందజేశారు. వేదపండితులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన దుర్గాప్రసాదరావు-సావిత్రి దంపతులను వేదపండితులు బేతనబోట్ల రాజారావు, బేతనబోట్ల ఫణిశర్మ వేదోచ్ఛరణం, మృత్యుంజయ జప పఠనంతో ఆశీర్వదించారు. పామర్రు లలితా పారాయణ బృంద మహిళలు లలితా సహస్రనామార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొగ్గవరపు జాలయ్య, మానవతా సంస్థ అధ్యక్షుడు శీతాల ప్రసాద్, ఎఎంసీ మాజీ చైర్మన్ మూడెడ్ల వెంకటేశ్వరరావు, ఎఎంసీ మాజీ డైరెక్టర్ జంపుల కోటేశ్వరరావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ త్రివిక్రమరావు, ఘంటసాల కళాపీఠం అధ్యక్షుడు కాటూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.