కృష్ణ

సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 13:ప్రభుత్వ, అటవీభూములకు పట్టాలు మంజూరు చేసిన చాట్రాయి తహశీల్దార్‌పై విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు. స్దానిక సబ్‌కలెక్టరు కార్యాలయం వద్ద సోమవారం ఈవిషయంపై ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాట్రాయి గ్రామంలో సర్వేనంబరు 16/1లోని ఫారెస్టు భూములను మంకొల్లు గ్రామపరిధిలోని సర్వే నంబరు 6/1,7/2,8/3,9/2బిలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు భూములను భూస్వాముల, ఆక్రమణల నుండి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. చాట్రాయి తహశీల్దార్ షాకీర్‌ఉన్నీసాబేగం ఇచ్చిన పాస్‌పుస్తకాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో భూతం మారయ్య, మేకల కూమారి, పేదలు పాల్గొన్నారు.