కృష్ణ

ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేస్తే ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : ఆంధ్రా బ్యాంక్ విలీనం ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక బెల్ కంపెనీ ఆడిటోరియంలో బుధవారం ఎఐటీయుసీ, సీఐటీయు ఆధ్వర్యంలో బ్యాంకుల విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, పుర ప్రముఖులు ఒకే మాట, ఒకే బాటపై పయనించాలన్నారు. 96 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను దివాలాతీసిన యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయడం దుర్మార్గపుచర్య అన్నారు. ఆంధ్రా బ్యాంక్‌ను మచిలీపట్నంలో పట్ట్భా సీతారామయ్య ప్రారంభించారన్నారు. అందుచేత ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వర్తక, వాణిజ్య, రైతులు ఆధ్వర్యంలో కోనేరు వద్ద మహానిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కమిటీని నియమించాలని సూచించారు. బందరులో చేసే నిరసన ఢిల్లీకి చేరుకున్నప్పుడే విలీన ప్రక్రియ ఆగే అవకాశం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో 1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగిందన్నారు. కానీ నేడు కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడానికి విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చారన్నారు. రూ.28లక్షల కోట్లను బడాబాబులు ఎగవేశారన్నారు. సీఐటీయు తూర్పు కృష్ణ అధ్యక్షుడు చౌటపల్లి రవి మాట్లాడుతూ ఇప్పటికే 27గా ఉన్న జాతీయ బ్యాంక్‌లు 12కి తగ్గాయన్నారు. మిగతావి విలీనం చేయనున్నారన్నారు. జనసేన పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమైఖ్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విలీనం చేయాలనుకుంటే మిగిలిన బ్యాంకులను ఆంధ్రా బ్యాంక్‌లో విలీనం చేయాలి తప్ప ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేస్తే ఆంధ్రులు ఉద్యమాలు ఉదృతం చేస్తారని హెచ్చరించారు. ఎఐటీయుసీ నాయకుడు బెల్లంకొండ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, లింగం ఫిలిప్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మురళీకృష్ణ, ఐసీఇయు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్ర, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, కొడాలి శర్మ, మోదుమూడి రామారావు, నిర్మల తదితరులు పాల్గొన్నారు.