కృష్ణ

మొవ్వలో విజయవంతమైన లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : అన్ని వర్గాల ప్రజలకు సత్వర న్యాయం అందించి న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ శనివారం మొవ్వలో విజయవంతమైంది. గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ అడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నిర్వహిచిన లోక్ అదాలత్‌కు చల్లపల్లి సర్కిల్ పరిధిలోని మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మండలాల కక్షిదారులు అత్యధికంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 41 కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు.
వీటిలో 29 క్రిమినల్ కేసులు, 11 ఎక్సైజ్ కేసులు, ఒక సివిల్ కేసు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చిట్టిప్రోలు ప్రసాద్, గొరిపర్తి శ్రీనివాసరావు, ఏపీపీ శ్యామల, సూపరింటెండెంటు పి రవిప్రసాద్, చల్లపల్లి సీఐ వెంకట నారాయణ, కూచిపూడి ఎస్‌ఐ కె ప్రతాప్‌రెడ్డి, ఘంటసాల ఎస్‌ఐ నాగరాజు, చల్లపల్లి ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

కుంటముక్కలలో పల్లెకు పోదాం, పాడిని చూద్దాం..
జి.కొండూరు, సెప్టెంబర్ 14: మండల పరిధిలోని కుంటముక్కలలో పల్లెకు పోదాం పాడిని చూద్దాం అనే కార్యక్రమంలో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు శనివారం పాల సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గల పాల ఉత్పత్తిదారులకు పశువుల కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. యూనియన్ సరఫరా చేసే దాణా మినిరల్ మిక్సర్, గడ్డికనుపులు, ఉచిత సూపర్ నేపియర్ కనుపులు, పశువులకు టీకాలు, అత్యవరసర సంచార వైద్యసేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సంఘానికి అత్యధికంగా పాలు సమకూర్చిన కలకుంట సాంబశివరావు, కాటూరి బసవయ్య, కస్తాల వెంకటప్పయ్యలను శాలువాలతో సత్కరించారు. ఎఎంసి మాజీ చైర్మన్ వుయ్యూరు వెంకట నరసింహారావు, పాలసొసైటీ అధ్యక్షుడు లంక రామకృష్ణ వరప్రసాద్, పాలకవర్గ సభ్యులు ఆంజనేయులును సన్మానించారు. యూనియన్ జిఎం జగన్మోహనరావు, డైరెక్ట్ రూట్స్ మేనేజర్ ప్రసాద్, సూపర్ వైజర్ నాగేశ్వరరావు, వేతన కార్యదర్శి, పాలకవర్గసభ్యులు, పాలఉత్పత్తిదారులు పాల్గొన్నారు.