కృష్ణ

సాంకేతిక రంగం ఆణిముత్యాలు ‘ట్రిపుల్ ఐటీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : సాంకేతిక విద్యా విధానంలో వినూత్న మార్పులు తీసుకువస్తూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా బోధన ట్రిపుల్ ఐటీల ద్వారా మాత్రమే జరుగుతుందని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఉప కులపతి కేసీ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రవేశాలలో పెద్ద పీట వేసి, వారిని సాంకేతిక రంగంలో మెరికల్లా తీర్చిదిద్ది, విద్యార్థులకు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొంటూ ట్రిపుల్ ఐటీలు సాంకేతిక రంగం అణిముత్యాలుగా ఆయన అభివర్ణించారు. ఆర్జేయుకేటీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో శనివారం రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకులుగా నూతనంగా నియమితులైన వారికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వీసీ కేసీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగిలిన విశ్వ విద్యాలయాలతో పోలిస్తే ఆర్జేయుకేటీ పరిధిలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీలు భిన్నమైనవని, ప్రత్యేకమైనవని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన లక్ష్యంతో వీటిని స్థాపించిందని తెలిపారు. ప్రతి అధ్యాపకుడు తరగతి గదులకు వెళ్ళే సమయంలో పూర్తి సంసిద్ధతతో వెళ్ళాలని, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాధ్యమంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అధ్యాపకులందరూ విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని నింపి, బోధించే ప్రతి అంశాన్ని ప్రాథమిక స్థాయి నుండి పూర్తి స్థాయిలో విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధించాలన్నారు. ఆర్జేయుకేటీలో కేవలం ఇంజనీరింగ్ విద్య మాత్రమే కాకుండా, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, మేనేజ్‌మెంట్, సైకాలజీలాంటి సబ్జెక్టులతో కూడిన విద్యా ప్రణాళికతో, గురుకుల విద్యా బోధనతో గురు శిష్య పరంపర అనే అంశంతో ముందుకు వెళ్తున్నామని, ఈ విధానాన్ని ప్రతి అధ్యాపకుడు విధిగా పాటించాలని విసీ కేసీ రెడ్డి సూచించారు. ఆంద్ర విశ్వవిద్యాలయం పారా సైకాలజీ పూర్వ శాఖాధ్యక్షుడు ఆచార్య కే మధు, కే ప్రసన్నకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ఏవివిఎస్ స్వామి, కే రామ్‌మోహనరావు వివిధ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు డి సూర్యచంద్రరావు, హర శ్రీరాములు, గోపాలరాజు, పరిపాలన అధికారి భగత్‌తో పాటు పలువురు ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.