కృష్ణ

జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల వినియోగానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా ఖనిజ అభివృద్ధి సంస్థ నిధులతో చేపట్టబోయే పనులకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ అభివృద్ధి సంస్థ సమావేశం జరిగింది. విద్య, వైద్య, ఆరోగ్య, పర్యావరణ, తాగునీరు, వౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోని 10 కిలో మీటర్ల పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా జిల్లా ఖనిజ అభివృద్ధి సంస్థ నిధులను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, గన్నవరం, ఆగిరిపల్లి, తిరువూరు, తోట్లవల్లూరు, ఘంటసాల మండలాల పరిధిలోని గ్రామాల్లో జిల్లా ఖనిజ అభివృద్ధి సంస్థ నిధులతో భౌతిక, సామాజిక అభివృద్ధికి ప్రత్యేక వౌలిక వసతులు కల్పించి ఆయా గ్రామాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. నిబంధనల ప్రకారం 55 శాతం నిధులను స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ట్యాంక్‌లు, నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌లు, వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల నిర్మాణాలు, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, గ్రంథాలయాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల నిర్మాణం, మాతృ, శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక సౌకర్యాలు, పర్యావరణ అనుకూలతకు చేపట్టే నిర్మాణాలు డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి నిర్మాణం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 40 శాతం నిధులను రహదారులు, భవనాల నిర్మాణం, జల వనరులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించడం, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు వీలుగా ఇంకుడు గుంటలు నిర్మాణం వంటి పనులను చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యతాపరంగా అవసరమైన పనులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, జెడ్పీ సీఇఓ షేక్ సలాం, గనులు, భూగర్భ శాఖ డెప్యూటీ డైరెక్టర్ ఎ శ్రీనివాస్, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, డీఇఓ ఎంవి రాజ్యలక్ష్మి, ఎస్‌ఎస్‌ఎ పీడీ ప్రసాదబాబు, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ రమేష్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజీ దిగువున మూడు బ్యారేజీల నిర్మాణానికి చర్యలు
- డెల్టా చీఫ్ ఇంజనీర్ సతీష్‌కుమార్
అవనిగడ్డ, సెప్టెంబర్ 16: కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున మూడు బ్యారేజీలు నిర్మించనున్నట్లు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ తెలిపారు. ఇందుకు గాను అనువైన ప్రాంతాల పరిశీలన నిమిత్తం సోమవారం ఆయన ప్రకాశం బ్యారేజీ నుండి పులిగడ్డ వరకు పర్యటించారు. ఈ మూడు బ్యారేజీల నిర్మాణంతో 10.66 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కొక్క బ్యారేజీ నిర్మాణానికి రూ.1200కోట్లు వెచ్చించడం జరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజీకి 12కిలో మీటర్ల దూరంలో చోడవరం వద్ద ఒక బ్యారేజీ, 45 కిలో మీటర్ల దూరంలో శ్రీకాకుళం వద్ద ఒక బ్యారేజీ, 65 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లా ఓలేరు వద్ద మరో బ్యారేజీ నిర్మించేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చోడవరం బ్యారేజీ వద్ద 2.71టీఎంసీలు, శ్రీకాకుళం బ్యారేజీ వద్ద 4.71 టీఎంసీలు, ఓలేరు వద్ద 3.25టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్‌ఇ కెఎల్‌విఎన్ చౌదరి, ఇఇ రాజా స్వరూప్ కుమార్ ఉన్నారు.