కృష్ణ

ప్రభుత్వ రాక్షసత్వంతోనే ‘కోడెల’ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ మృతి ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ రాక్షసత్వమేనని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆరోపించారు. సోమవారం మృతిపై ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడారు. కేవలం వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, రాక్షసత్వమే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, సభాపతిగా సేవలు అందించిన కోడెలపై ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి అధికార పీఠం ఎక్కిన నాటి నుండి అనేక విధాలుగా వేధింపులకు పాల్పడ్డారన్నారు. చిన్న చిన్న విషయాలపై కూడా కోడెలపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి కాబట్టే కోడెల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల ఆత్మహత్యపై కూడా వైసీపీ రకరకాలుగా విష ప్రచారం చేస్తోందన్నారు. కోడెల మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు.

‘కోడెల’ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
- మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన ఫోన్‌లో కోడెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. పల్నాటి పులిగా పేరొందిన కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడటం నమ్మసక్యంగా లేదన్నారు. దివిసీమ అభివృద్ధిలో కోడెల పాత్ర ఎంతగానో ఉందన్నారు. నిధులు మంజూరులో ప్రత్యేక చొరవ చూపారన్నారు. తరచూ గాంధీ క్షేత్రానికి వచ్చేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.