కృష్ణ

మద్యం దుకాణం ఏర్పాటుకు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : మండల కేంద్రం మొవ్వ గ్రామంలోని ప్రధాన సెంటరు వద్ద ఉన్న మద్యం దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టనున్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దంటూ సీపీఎం మొవ్వ మండల నాయకులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు మంగళవారం ఎక్సైజ్ ఇన్‌ఛార్జి సీఐ కె శేఖర్‌బాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గతంలో తాము స్పందన కార్యక్రమం ద్వారా చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడ చెవిన పెట్టి ఈ దుకాణంలోనే నూతన మద్యం దుకాణం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో ఆగ్రహించిన ఎంఆర్‌పీఎస్ నాయకులు ఇన్‌ఛార్జి సీఐ శేఖర్‌బాబును చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీనిపై సీఐ శేఖర్‌బాబు మాట్లాడుతూ గతంలోనే తాను ఈ విషయాన్ని తెలియపర్చానని, జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటును జెసీ మాధవీ లత పర్యవేక్షిస్తున్నారని తాను గతంలోనే తెలిపానని పేర్కొనటంతో ఆగ్రహించిన నాయకులు లిఖిత పూర్వకంగా తమకు ఈ విషయాన్ని తెలియచేయాలని డిమాండ్ చేశారు. అందుకు శేఖర్‌బాబు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో శీలం ప్రకాశరావు, శీలం రాంబాబు, చిరువోలు సుధాకర్, జి అబ్రహం, నెరసు శ్రీనివాసరావు, గోవిందరాజు, చింతయ్య తదితరులు పాల్గొన్నారు.