కృష్ణ

అంతిమ యాత్రలో పల్నాటి పులి కోడెలకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/ జగ్గయ్యపేట రూరల్/ కంచికచర్ల : రాష్ట్ర సరిహద్దు గరికపాడు నుంచి సాగిన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అంతిమయాత్రలో జోహార్లు పలుకుతూ అడుగడుగునా టీడీపీ నాయ కులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. కోడెల శివప్రసాద్ మృతదేహాన్ని మంగళవారం హైదరాబాద్ నుండి నరసరావుపేటకు తరలించే క్రమంలో ఆంధ్రా, తెలంగాణ ప్రధాన సరిహద్దు మండలంలోని గరికపాడు వద్ద నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట, నందిగా మ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ మీదుగా పెద్ద ఎత్తున అంతిమ యాత్ర సాగింది. తండోప తండాలుగా తరలివచ్చిన జనం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో పార్టీనేతలు, అభిమానులు, కార్యకర్తలు గరికపాడు వద్దకు తరలిరావడంతో హైవే కిక్కిరిసి పోయింది. కోడెల భౌతికకాయం ఉంచిన ప్రత్యేక అంబులెన్స్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, నారా లోకేష్ ఇతర నేతల వాహనాలు భారీ కాన్వాయ్‌తో తరలివచ్చాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందుగానే సమాచారం ఇవ్వడంతో పలు ప్రదేశాల నుండి పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, అభిమానులు భారీగా వాహనాలతో తరలివచ్చారు. జగ్గయ్యపేట సీఐ నాగేంద్రబాబు, చిల్లకల్లు ఎస్‌ఐ చిరంజీవి, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీస్‌సిబ్బంది భారీగా బందోబస్తు నిర్వహించారు. పోలీసులు రోప్ పార్టీలను కూడా ప్రత్యేకంగా రప్పించారు. 1 గంట సమయానికి అంబులెన్స్, మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ గరికపాడు చేరుకోగా అభిమానులు, కార్యకర్తలు కోడెల పార్థివదేహాన్ని చూసేందుకు పోటీపడ్డారు. కోడెల జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గరికపాడు నుండి భారీ ర్యాలీ నిర్వహించాలని నియోజకవర్గ పార్టీ నేతలు భావించి ప్రత్యేక వాహనం అలంకరించి సిద్ధం చేసినప్పటికీ అగ్రశ్రేణి నాయకత్వం అమోదించకపోవడంతో నిరుత్సాహపడ్డారు. కోడె ల భౌతికకాయం ఉన్న అంబులెన్స్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆపడంతో నివాళులు అర్పించేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రెండు గంటలకు పైగా ఎండలో వేచి ఉన్నప్పటికీ కడసారి చూసే అవకాశం లేకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఐతే చంద్రబాబు వాహనంలో నుండి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేయడంతో కొంత ఉపశమనం పొందారు. చంద్రబాబును చూసేందుకు, ఫోటో లు తీసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. చంద్రబాబు వాహనం వెంట జేజేలు కొడుతూ పరుగులు పెట్టారు. చిల్లకల్లు వద్ద కొద్దిసేపు వాహనాలు నిలిపివేయగా చంద్రబాబుతో పాటు లోకేష్ మరొక వాహనంలోకి మారగా ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు, నెట్టెం రఘురామ్, దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, నల్లగట్ల స్వామిదాసులు చంద్రబాబు, లోకేష్‌ను కలిశారు. జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి ఆచంట సునీత, ఏఎంసీ చైర్మన్ కట్టా నరసింహారావు, పార్టీ నేతలు ముల్లంగి రామకృష్ణారెడ్డి , యలమంచిలి రాఘవ, కెఎస్‌ఎన్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సోదరులు శ్రీరామ్ సాయిప్రసాద్, ధనుంజయ, గింజుపల్లి రమేష్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఇలావుండగా దివంగత కోడెల శివప్రసాద్‌కు నివాళులర్పించేందుకు మంగళవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు నందిగామ టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. హైదరాబాదు నుండి గుంటూరుకు అంబులెన్స్‌లో వెళుతున్న కోడెల పార్ధివ దేహాన్ని స్థానిక పార్టీ కార్యాలయం వద్ద తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తదితర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సందర్శించి నివాళులర్పించారు. జోహార్ కోడెల అంటూ నినాదాలు చేశారు. జోరున వర్షం కురుస్తున్నా స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలు, అభిమానులు కోడెలకు నివాళులర్పించారు. ఇక కంచికచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మండలంలోని కీసర, కంచికచర్ల, పెండ్యాల గ్రామం వద్ద కోడెల పార్ధివ దేహానికి నేతలు నివాళులర్పించారు. ఎఎంసి మాజీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు నన్నపనేని నర్శింహరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ఆల్లాడి కోటేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేమా వెంకట్రావు తదితర నేతలు కోడెల భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.