కృష్ణ

మళ్లీ బతుకు పోరుకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 14: రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు నేటి నుండి సముద్ర వేటను పునః ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన రెండు నెలల వేట నిషేధం బుధవారంతో తొలగనుంది. గత ఏప్రిల్ 14 నుండి మంగళవారం వరకు రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉండటంతో మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సముద్రంలో చేపలను వేటాడటం తప్ప మరే ఇతర పనులు రాని మత్స్యకారులు ఈ రెండు నెలలు దుర్భర జీవితాన్ని గడిపారు. వేట లేక, ప్రభుత్వం ఇస్తామన్న భృతి అందకపోవటంతో అర్ధాకలితో అలమటించారు. జిల్లాలో మొత్తం 4వేల 200 మంది మత్స్యకారులకు రూ.4వేలు చొప్పున జీవనభృతి అందాల్సి ఉంది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా మత్స్యకారులకు ఇచ్చిన పాపాన పోలేదు. అర్హులైన మత్స్యకారుల నుండి బ్యాంక్ ఎకౌంట్లు, ఆధార్ కార్డులు తీసుకున్న మత్స్య శాఖాధికారులు వారి ఎకౌంట్లలోకి భృతి సొమ్ము జమ చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. నిషేధిత సమయాన్ని అంతా బ్యాంక్ ఎకౌంట్లు, ఆధార్ కార్డుల పరిశీలనకు కేటాయించడం గమనార్హం.
భృతి అందిస్తాం
మత్స్యకారుల జీవన భృతి పంపిణీ విషయమై మత్స్య శాఖ ఎడి జయరావును వివరణ కోరగా.. భృతి అందించే విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఉండేందుకు బ్యాంక్ ఎకౌంట్లు, ఆధార్ కార్డు నెంబర్ల పరిశీలన చేపట్టామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మత్స్యకారులకు అందించాల్సిన జీవన భృతి ఫైల్‌ను కలెక్టర్ అప్రూవల్‌కు పెడతామన్నారు. కలెక్టర్ అప్రూవల్ అనంతరం మత్స్యకారుల ఎకౌంట్లకు నేరుగా సొమ్ము జమ చేస్తామని ఆయన వివరించారు.