కృష్ణ

ఒత్తిళ్లకు లొంగకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : గ్రామ వలంటీర్లు ఒత్తిళ్లకు లొంగకుండా అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆటో, టాక్సీ, క్యాబ్ యజమానులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేత పథకం లబ్ధిదారుల ఎంపికపై బుధవారం స్థానిక మున్సిపల్ ప్రధాన పార్కులోని గరల్స్ హైస్కూల్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆ ధ్వర్యంలో వలంటీర్ల సమావేశం నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో వ లంటీర్లదే కీలక పాత్ర అన్నారు. వలంటీర్లకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఎవరైనా ఆటో, టాక్సీ, క్యాబ్ యజమానులు ఉన్నారా..? వారికి నిజంగానే ఆ టో, టాక్సీ, క్యాబ్‌లు ఉన్నాయా..? ఉం టే వారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉ న్నారా..? ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సా యానికి వీరు అర్హులా కాదా..? అనే అంశాలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ పథకానికి మంచి స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.5లక్షల వాహనాలు ఉం డగా 4లక్షల మంది ఓనర్ కం డ్రైవర్లు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. నేటి వరకు జిల్లాలో ఆన్‌లైన్‌లో 60వేల దరఖాస్తులు వచ్చాయని, మరో 3.4లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వలంటీర్లను లోకువగా చూడవద్దని అధికారులకు మంత్రి సూచించారు. కొన్ని శాఖల అధికారులు వలంటీర్లను లోకువగా చూస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులే కాకుండా ఇతర పనులు కూడా వారితో చేయిస్తుండటం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ డీఇ భానోజీరావు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, తహశీల్దార్ సునీల్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.