కృష్ణ

‘సంక్షేమం’ అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : సంక్షేమం అయోమయంలో పడింది. స్వయం ఉపాధి కల్పనకు వివిధ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం మంజూరు చేయనున్న సబ్సిడీ రుణాల పంపిణీ గందరగోళంగా మారింది. ప్రభుత్వ మార్పిడితోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ కార్పొరేషన్‌ల ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వం సబ్సిడీ రుణాలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ కింద కార్పొరేషన్ రుణాల పంపిణీ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్‌లతో పాటు వివిధ రకాల ఫెడరేషన్‌ల ద్వారా రుణాల పంపిణీ ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వ మార్పిడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేషన్ రుణాల యాక్షన్ ప్లాన్ తయారీలో కొంత జాప్యం జరిగింది. ప్రధాన కార్పొరేషన్‌లకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధమైనా ఫెడరేషన్‌లకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఇప్పటికీ తయారు కాలేదు. కానీ అర్హులైన లబ్ధిదారుల నుండి ప్రభుత్వం ఓబీఎంఎంఎస్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై సబ్సిడీ మొత్తం విడుదల కాని లబ్ధిదారుల పరిస్థితి నేడు అయోమయంగా మారింది. వీరందరికీ ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేస్తుందా..? లేక రద్దు చేస్తుందా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదే విషయమై లబ్ధిదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. గత ప్రభుత్వంలో తమకు మంజూరైన రుణాలను ఇస్తారా..? లేక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా..? అనే అంశంపై కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అయితే వీరికి సమాధానం చెప్పడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. సబ్సిడీ విడుదలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి లబ్ధిదారులను తిరిగి పంపించేస్తున్నారు. దీనిపై స్పష్టత లేకుండానే ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి రుణ మంజూరు లక్ష్యాలను ఆయా కార్పొరేషన్‌కు నిర్దేశించడం విశేషం. జిల్లాలో మొత్తం 17వేల 728 మంది లబ్ధిదారులు ప్రభుత్వం విడుదల చేసే సబ్సిడీ మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా రూ.123.14 కోట్లు మేర సబ్సిడీ మొత్తం విడుదల కావల్సి ఉంది. సబ్సిడీ మొత్తం విడుదలైన తర్వాత బ్యాంక్‌ల ద్వారా రూ.118.95 కోట్ల మేర సంబంధిత లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంజూరైన రుణాలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై స్పష్టత ఇచ్చే వారు కూడా కరువయ్యారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హోల్‌సేల్ మర్చంట్స్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 20: నగరంలోని బెల్లంకొట్ల సందులో పలు హఓల్‌సేల్ మర్చంట్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలు, ఎంఆర్‌పీ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయా..? లేవా..? తదితర అంశాలను పరిశీలించారు. రిజిష్టర్‌లో పేర్కొన్న విధంగా స్టాక్ దుకాణాల్లో ఉందో లేదో చూశారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని విజిలెన్స్ సీఐ రవికాంత్ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్‌ఐ నబీ తదితరులు ఉన్నారు.