కృష్ణ

బుగ్గకారు వదిలి.. సైకిలెక్కి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 14: ఎప్పుడూ బుగ్గకారులో ఎదుట పోలీస్ ఎస్కార్ట్, వెనుక కాన్వాయ్‌లో ప్రయాణించే రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సైకిల్‌పై తిరిగారు. ఉదయానే్న పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి సైకిల్‌పై వార్డుల పర్యటన చేసిన మంత్రి రవీంద్రకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలికాయి. పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి రవీంద్ర సైకిల్ బాటను ఎంచుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల తీరు పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కోనేరు సెంటరులో బయలుదేరిన మంత్రి రవీంద్ర బృందం బస్టాండ్ సెంటర్, జెడ్పీ సెంటర్, పెయింటర్స్ కాలనీ, నీలగిరి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. పెయింటర్స్ కాలనీ, నీలగిరి కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తున్నా పనులు మాత్రం అంతంతమాత్రంగా ఉంటున్నాయని మండిపడ్డారు. డ్రైన్లలో మురుగునీరు పారుదల లేక తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వర్షాకాలంలో అయితే ఇళ్ళల్లోకి మురుగునీరు వచ్చి చేరుతోందని పెయింటర్స్ కాలనీ వాసులు మంత్రి రవీంద్రకు ఫిర్యాదు చేశారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను మంత్రి మందలించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రైనేజీల అనుసంధానికి మొదటి విడతగా రూ.18కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో డ్రైనేజీలను అనుసంధానం చేసి సక్రమంగా మురుగునీటి పారుదలకు కృషి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు మా ప్రాంతాలకు రావడం లేదని కాలనీ వాసులు మంత్రికి ఫిర్యాదు చేయగా తక్షణమే ట్యాంకర్లు పంపిస్తామన్నారు. పోతేపల్లి ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగక రాత్రిళ్ళు తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ పర్యటనలో వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, బత్తిన దాస్, లోగిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనీల్ పాల్గొన్నారు.