కృష్ణ

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఉద్యోగపరమైన సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, డెప్యుటేషన్, సస్పెన్షన్ ఇంక్రిమెంట్లు, అనారోగ్య సమస్యలు, కుటుంబపర సమస్యలు, తదితర సమస్యలపై ఆయన పోలీసు సిబ్బంది నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇతర సమస్యల పరిష్కారానికి కూడా తన వంతు కృషి చేస్తానన్నారు.