కృష్ణ

సామాజిక శాంతితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు : సామాజిక శాంతి ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని ఉయ్యూరు పోలీసు సీఐ సీహెచ్ నాగప్రసాద్ అన్నారు. ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలను స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈసందర్భంగా శాంతి కపోతాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పరమత సహనం భారతీ జీవన విధానమన్నారు. విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నప్పటికీ అందరం ఐక్యంగా ఉన్నామని, ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఐక్యతను దెబ్బతీసే శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కే కోటిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిందా వెంకట కుటుంబరాజు, జమాఅతే ఇస్లామ్, వాసవీ క్లబ్ ప్రతినిధులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని కాటూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రపంచ శాంతి దినోత్సవం, గురజాడ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

శివప్రసాద్ మృతి టీడీపీకి తీరనిలోటు
మైలవరం, సెప్టెంబర్ 21: చిత్తూరు మాజీ ఎంపి శివప్రసాద్ మృతి టిడిపికి తీరనిలోటని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. మైలవరంలో టిడిపి కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. వారంలోనే ఇద్దరు ముఖ్య నేతలను పార్టీ కోల్పోయిందన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. వారికి ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షించారు. టిడిపి నాయకులు తాతా పోతురాజు, మాజీ ఎంపిపి లక్ష్మీ, ధనేకుల బుల్లిబాబు, మల్లెల రాధాకృష్ణ, బాలకృష్ణ, సహానాబేగం తదితరులు పాల్గొన్నారు.