కృష్ణ

సచివాలయ వ్యవస్థకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లాలో సచివాలయ వ్యవస్థకు రంగం సిద్ధమైంది. మహాత్మ గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వతేదీ నుండి సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుండి మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియకు తెర తీశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు గాను ఇటీవల రాత పరీక్షలు నిర్వహించగా జిల్లాకు సంబంధించి 69వేల 216 మంది అర్హత సాధించారు. జిల్లాలో 11వేల 25 వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 2లక్షల 665 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో లక్షా 77వేల 533 మంది పరీక్షలకు హాజరు కాగా 23వేల 132 మంది గైర్హాజరయ్యారు. 69వేల 216 మంది ఉత్తీర్ణులయ్యారు. కేటగిరి-1కు సంబంధించి వివిధ పోస్టులకు గాను లక్షా 4వేల 761 మంది పరీక్షలు రాయగా 50వేల 577 మంది అర్హత పొందారు. కేటగిరి-2ఎ పోస్టులకు సంబంధించి 12వేల 204 మంది పరీక్షలు రాయగా 3వేల 927 మంది, కేటగిరి-2బి పరీక్షకు సంబంధించి 12వేల 395 మందికి గాను 1850 మంది, కేటగిరి-3 పోస్టులకు గాను 48వేల 173 మందికి గాను 12వేల 862 మంది ఉత్తీర్ణులయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాలను ఈ నెల 24, 25తేదీల్లో విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో పరిశీలించనున్నారు. ఇందుకు గాను అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 22, 23తేదీల్లో కాల్ లెటర్స్‌ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా పంపనున్నారు. కాల్‌లెటర్స్ అందుకున్న వారు తమ ధృవపత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చే యాల్సి ఉంటుంది. ధృవపత్రాల పరిశీలన అనంతరం ఈ నెల 27, 28, 29తేదీల్లో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ద్వారా నియామక పత్రాలు అందచేయనున్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి ఈ నెల 30, అక్టోబర్ 1వతేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తదుపరి అక్టోబర్ 2వతేదీ నుండి విధుల్లోకి రానున్నారు.

ప్రజలు మెచ్చేలా పోలీసు సేవలు
* క్రైం మీటింగ్‌లో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

మచిలీపట్నం, సెప్టెంబర్ 21: ప్రజలు మెచ్చే విధంగా సేవలు అందించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. నందిగామ, నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నెల వారీ నేర సమీక్షా సమావేశాన్ని శనివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందనలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రాపర్టీ క్రైం, మహిళాలపై వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఇక నుండి జిల్లాలో ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పని చేస్తుందన్నారు. మంగళ, శని, ఆదివారాల్లో నో యాక్సిడెంట్ డేను జిల్లా అంతా అమలు చేయాలన్నారు. ఆయా రోజుల్లో సిబ్బంది బ్లాక్ స్పాట్స్ వద్ద ఉండి వాహనచోదకులను అప్రమత్తం చేసి, ప్రమాదాలను ఏ విధంగా నివారించవచ్చో వివరిస్తూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించే వారిని అభినందిస్తు, పాటించని వారికి ప్రమాదం సంభవిస్తే కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నం అవుతాయో తెలియచేయాలన్నారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. అవినీతికి పాల్పడే పోలీసు అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. నిస్వార్ధమైన, అవినీతి రహితమైన పోలింగ్ వ్యవస్థను ప్రజలకు అందించడంలో రాజీ లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, నందిగామ, నూజివీడు డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, రాజారావు, సీఐలు వీరయ్య గౌడ్, వెంకట రమణ, రామచంద్రరావు, శ్రీను, సతీష్, నాగేంద్ర కుమార్, రవికుమార్, డీసీఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.