కృష్ణ

రివర్స్ టెండరింగ్ పేర ప్రాజెక్టుల ఆలస్యానికి బాధ్యులు ఎవ్వరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : రివర్స్ టెండరింగ్‌లు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేస్తున్న పనులతో ప్రాజెక్టులు అలస్యం అవ్వడమే కాక ప్రాజెక్టుల భధ్రతకు ముప్పు ఏర్పడుతుందని మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రివర్స్ టెండరింగ్ వల్ల 50 కోట్లు మిగిలాయని చెబుతున్నారని, ఆలస్యంతో సంవత్సరానికి 300 కోట్ల విద్యుత్ బిల్లు అదనపు భారమై మూడు సంవత్సరాల్లో 900 కోట్లు భారం అవుతుందని అన్నారు. ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల వేల కోట్ల పంటల దిగుబడి రైతులు కోల్పోతారని అన్నారు. అనుభవం గల నవయుగ కంపెనీని కాదని, ఎటువంటి అనుభవం లేని ప్రాజెక్టుకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. గత వైఎస్ పాలనలో జలయజ్ఞం పేర వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో దేశం నేతలు మేకా వెంకటేశ్వర్లు, షేక్ సత్తార్, ఎ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

మోపిదేవి స్వామి వస్త్రాల ఆదాయం రూ.22,990
మోపిదేవి, సెప్టెంబర్ 22: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ జివిడిఎన్ లీలాకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వేలం పాట నిర్వహించారు. 15 పంచెలు, 95 చీరెలు వేలం పాట నిర్వహించగా రూ.22,990 లభించినట్లు లీలా కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూధనరావు, అధికారులు మల్లేశ్వరరావు, మురళీ, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం శెలవుదినం కావటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. పాలపొంగళ్లు, కేశఖండనలు, ఒడుగులు, చెవిపోగులు తదితర మొక్కుబడులు తీర్చుకున్నారు. నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ స్వామివారి శాంతి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అవనిగడ్డ జూనియర్ సివిల్ జడ్జి సరస్వతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు.