కృష్ణ

సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. ఆదివారం అవనిగడ్డ వచ్చిన ఆయన గ్రామ సచివాలయాల నిమిత్తం గుర్తించిన భవనాలను పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల కోసం అనువైన భవనాలను గుర్తిస్తున్నామన్నారు. జిల్లాలో 11,025 గ్రామ సచివాలయ ఉద్యోగ పోస్టులకు గాను రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుండి ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్స్‌ను ఎస్‌ఎంఎస్, వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. ఈ నెల 24, 25తేదీల్లో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం 27వతేదీన నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 30, అక్టోబర్ 1వతేదీన నియామక పత్రాలు అందుకున్న వారికి సచివాలయ వ్యవస్థపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2వతేదీ నుండి వారంతా విధుల్లోకి వెళతారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జె ఉదయ భాస్కర్, తహశీల్దార్ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకులతో హంసలదీవి బీచ్ కళకళ
కోడూరు, సెప్టెంబర్ 22: వాతావరణం ఎండలు కాసి సముద్రం ఉపరితలంపై నుంచి చల్లటి గాలులు వీస్తుండటంతో హంసలదీవి బీచ్‌లో పర్యాటకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం సాయంత్రం వరకు యువకులు ఉత్సాహంగా స్నానాలు చేశారు. మెరైన్ సీఐ పవన్ కిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది పర్యాటకులకు ప్రమాదాలు జరగకుడా అవగాహన కల్పించారు.