కృష్ణ

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బది‘లీలలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 16: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వం నుండి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోయినా బదిలీలకు సంబంధించి నిబంధనలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గురువారం రాత్రి వరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం ఓ ఉద్యోగి బదిలీలకు సంబంధించిన నిబంధనల ప్రొఫార్మాను రెండు రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ఆ శాఖ ఉద్యోగులను కలవరపరుస్తోంది. జిల్లావ్యాప్తంగా ఐదు సంవత్సరాలకుపైబడి విధులు నిర్వహిస్తున్న స్ట్ఫా నర్సులు, ఎఎన్‌ఎంల సమాచారం ఈ ఉద్యోగి చూస్తున్నాడు. దీంతో తనకు సన్నిహితంగా ఉండే వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకోవాలనే ఉద్దేశంతో మార్గదర్శకాలు రాకపోయినా స్వతహాగా తయారుచేసిన ప్రొఫార్మాను ఆన్‌లైన్‌లో పెట్టి అక్రమార్జనకు తెరలేపాడన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ప్రొఫార్మాను కూడా నేరుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి మెయిల్ నుండి పెట్టడం మరింత విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే సుమారు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా చెపుతున్నారు. ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయకుండా వైద్య ఆరోగ్య శాఖలోని నిబంధనల పట్టికను ఆన్‌లైన్‌లో పెట్టిన విషయం తెలిసిన కొందరు అధికారులు వారించినప్పటికీ లక్ష్యపెట్టకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మెయిల్‌లోనే పెట్టడం గమనార్హం. సంవత్సరాల తరబడి డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న సదరు ఉద్యోగి ఆగడాలను ఆరికట్టకపోతే బదిలీల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదు. అంతేకాకుండా అర్హులకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
విచారణ జరుపుతాం:డిఎంహెచ్‌ఓ
ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. ఆర్ నాగమల్లేశ్వరిని వివరణ కోరగా విచారణ జరుపుతామని తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం అర్ధరాత్రికి మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ముందస్తుగా బదిలీల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చామన్నారు. జాబితాలపై అభ్యంతరాలకు రెండు రోజులు గడువు ఇచ్చినట్టు ఆమె వివరించారు.