కృష్ణ

ధర్నా చౌక్‌లోనే నిరసనలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు సమీపంలో గుర్తించిన ధర్నా చౌక్‌లోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత పోలీసులను ఆదేశించారు. సోమవారం ఆమె ధర్నా చౌక్‌ను పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగాలో కలెక్టరేట్ వద్ద రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేయడం వల్ల కొంత మేర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్సమీపంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ధర్నా చౌక్‌గా గుర్తించడం జరిగిందన్నారు. ఇకపై ఆ ప్రాంతంలోనే ధర్నాలు, నిరసనలు జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. ధర్నా చౌక్ పరిశీలనలో డీఆర్‌ఓ ఎ ప్రసాద్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, డీఎస్పీ మొహబూబ్ బాషా తదితరులు ఉన్నారు.

11న బందరులో డీఆర్‌సీ సమావేశం

మచిలీపట్నం, అక్టోబర్ 7: ఈ నెల 11వతేదీన జిల్లా అభివృద్ధి సమీక్షా (డీఆర్‌సీ) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కన్నబాబు అధ్యక్షతన ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఇందుకు గాను సోమవారం ఆమె జెడ్పీ సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సమావేశ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావును ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని తెలిపారు. శాఖాధికారులు తమ తమ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక తయారు చేయాలని ఆమె ఆదేశించారు.