కృష్ణ

రైతు భరోసా అర్హుల జాబితాను సత్వరం సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం అర్హుల జాబితాను సత్వరం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వతేదీ నుండి వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి నిధి ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్పందన అనంతరం రైతు భరోసా పథకం అమలుపై తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గుర్తించిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించాలన్నారు. ఆధార్ మిస్‌మ్యాచ్ అయిన వారి జాబితాలు క్షుణ్ణంగా పరిశీలించి వారి ఆధార్ సమస్యను పరిష్కరించాలన్నారు. రానున్న ఉగాది నాటికి సొంత ఇల్లు లేని వారికి నివేశన స్థలాలు, పక్కా గృహాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భూముల గుర్తింపు, అర్హుల జాబితాలను సిద్ధం చేయాలన్నారు. నివేశన స్థలాలు కలిగి ఉన్న వారికి పక్కా గృహం మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్ భూము సంబంధిత రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. అక్టోబర్ 15వతేదీ నాటికి ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలన్నారు. 2020 జనవరి 1వతేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, సివిల్ సప్లైస్ డీఎం రాజ్యలక్ష్మి, డీఆర్‌డీఎ పీడీ ఎం శ్రీనివాసరావు, జెడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారులతో ‘పేర్ని’ నివాసం కిటకిట
మచిలీపట్నం (కోనేరుసెంటరు), అక్టోబర్ 7: రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కార్యాలయం శనివారం లబ్ధిదారులతో కిటకిటలాడింది. తన భర్త చేపల వేటకు కృష్ణానదిలో దిగి మృతి చెందాడని, తనకు రావల్సిన ఇన్సూరెన్స్ పరిహారాన్ని కొంత మేరకు మాత్రమే ఇచ్చారని మిగిలిన పరిహారాన్ని ఇప్పించాలని తాడేపల్లి గ్రామానికి చెందిన అంకాని రాజకుమారి మంత్రికి విన్నవించగా కేసు పూర్వాపరాలను పరిశీలించి ఇన్సూరెన్స్ పరిహారం వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎస్‌ఎన్ గొల్లపాలెంకు చెందిన సిహెచ్ కాంతి రేఖ తనకు గ్రామ సచివాలయ ఉద్యోగం పొందానని చెప్పటానికి వచ్చానని మంత్రికి తెలుపగా అందుకు మంత్రి స్పందించి గ్రామ సచివాలయాల ఉద్యోగాల ఎంపిక ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. మీ నాన్న సిహెచ్ రామచంద్రరావుమాజీ సర్పంచ్ అయినప్పటికీ రాజకీయ పలుకుబడితో కాకుండా మీకున్న సామర్ధ్యం, అర్హతలతో ఉద్యోగం దక్కించుకున్నారని మీ కష్టానికి ప్రతిఫలం దక్కిందని మంత్రి అభినందించారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వద్ద డీజేలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇప్పించాలని స్థానికులు మంత్రిని కోరగా శబ్ధ కాలుష్యం వలన స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అందువల్ల పోలీసు అధికారులు డీజేలకు అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి వారికి స్పష్టం చేశారు. ఇలా అనేక మంది పలు సమస్యలతో మంత్రి పేర్ని నాని వద్దకు చేరుకుని సమస్యలను విన్నవించుకున్నారు.