కృష్ణ

దళారీలకు ఇసుకను దోచి పెడుతున్న జగన్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : నూతన ఇసుక విధానం పేరుతో కుత్రిమ కొరత సృష్టించి దళారీ వ్యవస్థను జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ ఇసుక కొరతపై ఈ నెల 11వతేదీన కోనేరుసెంటరులో 36 గంటల నిరవధిక నిరసన దీక్షకు కూర్చుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలుగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. ప్రధానంగా నూతన ఇసుక విధానమంటూ భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా సామాన్యులకు ఇసుక లభించని పరిస్థితి ఏర్పడింది. దళారీలకు మాత్రం కావల్సినంత ఇసుకను అడ్డదారుల్లో పంపిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు టన్ను ఇసుక రూ.2300లు చొప్పున విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇసుక అందక కార్మిక వర్గం పస్తులుంటున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం చీమకుట్టినటైనా లేదన్నారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన 30 రకాల పని వార్లు పనులు లేకపోవటంతో పూట గడవక, అప్పులు పుట్టక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారన్నారు. ఆర్థిక నేరస్థుడిగా ఉన్న సీఎం జగన్ తన బెయిల్‌ను ఎక్కడ రద్దు చేస్తారో అన్న భయంతో హడావుడిగా ప్రధాని మోదీని కలిశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోని జగన్ తన వ్యక్తి ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు హోదా నినాదం ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన కడప జిల్లాలో యురేనియం తవ్వకాలపై జగన్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. కడప వాసిగా యురేనియం తవ్వకాల విషయాన్ని ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) మాట్లాడుతూ ఇసుక కొరత పేరుతో నిర్మాణ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా భ్రష్ఠు పట్టించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ముందు చూపు లేకపోవటంతోనే నేడు ఇసుక సమస్య తలెత్తిందన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ రంగం అదోగతిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, మరకాని పరబ్రహ్మం, గనిపిశెట్టి గోపాల్, సాతులూరి నాంచారయ్య, లంకిశెట్టి నీరజ, అబ్దుల్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

బోటు ప్రమాదంలో మృతుని కుటుంబానికి పరిహారం
హనుమాన్ జంక్షన్, అక్టోబర్ 7 : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి సోమవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ 5 లక్షల పరిహారం అందజేశారు. బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన సలీమ్ స్నేహితులతో కలిసి పాపికొండలు విహార యాత్రకు వెళ్ళాడు. గోదావరి వరద ఉద్ధృతికి రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతో తొలి విడతగా జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఐదు లక్షల పరిహారాన్ని సలీమ్ తల్లిదండ్రులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు, సబ్ కలెక్టర్ స్విప్నిల్ దినకర్, బాపులపాడు మండల రెవెన్యూ అధికారి నరసింహారావు, వైకాపా రైతు నాయకుడు అవిర్నేని శేషగిరి రావు, మండల పార్టీ అధ్యక్షుడు దుట్టా శ్రీమన్నారయణ తదితరులు పాల్గోన్నారు.