కృష్ణ

జయ జయ హే మహిషాసురమర్ధీని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి : అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైనా మహిషాసురుడిని సంహరించిన ఈదేవి దర్శనానికి సోమవారం వేకువ జామునుండే భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే కావటంతో ఆమె ఆశీస్సులను పొందటానికి భక్తులు బారులు తీరారు. సర్వ దోషాలను తొలగించి సంపూర్ణ విజయం ప్రసాదించాలని కోరుతూ తరలి వచ్చారు. దసరా మహోత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) రోజున శ్రీకనకదుర్గమ్మ ఈఅలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చింది. మహోత్సవాలు ముగింపుదశకు చేరుకోవటంతో భక్తులు వేకువ జామునుండే పోటెట్తారు. ఈవో ఎంవీ సురేష్‌బాబు ఆదేశాలతో సోమవారం ఉదయం కూడా సహాయ ఈవో ఎన్ రమేష్ వేకువజాము నుండే భక్తులకు కేవలం ముఖమండప దర్శనం వరకే అనుమతించారు. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో రెండు బ్యాచ్‌లు కలిసి సుమారు 250మంది దంపతులు, చండీహోమంలో సుమారు 200 మంది దంపతులు పాల్గొన్నారు. ఈరెండు ఆర్జిత సేవాల్లో పలువురు వీఐపీలు ఉన్నారు. ఈరెండు ప్రత్యేక ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను సిబ్బంది ప్రత్యేక క్యూమార్గం గుండా అంతరాలయంలోకి పంపారు. తెల్లవారుజామున క్యూ మార్గాల్లోని భక్తులను పోలీసులు కొండపైకి అనుమతించారు. కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించిన భక్తులను టోల్‌గేట్ మీదుగా నుండి కొండపైకి పంపారు. క్యూమార్గంలోని భక్తులకు పాలు, టీ, వాటర్ ప్యాకెట్‌లను ఉచితంగా అందచేశారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు రాధాకృష్ణుల విగ్రహం వద్ద సిబ్బంది ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. తర్వాత భక్తులు మల్లిఖార్జునస్వామిని దర్శనం చేసుకొని మెట్లమార్గం గుండా కనకదుర్గనగర్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులు అమ్మవారి మహాప్రసాదాలలైన లడ్డూ, పులిహార కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న నిత్యాన్నదానం కేంద్రంలో అన్న ప్రసాదాన్ని సుమారు 15వేల మంది భక్తులు స్వీకరించారు.