కృష్ణ

అర్చకుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : అర్చకులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారానికి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అవనిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన 29 అడుగుల మహాశివుని విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ అర్చకుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 16వ తేదీన సచివాలయంలో అర్చక సమాఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21 అంశాలతో కూడిన సమస్యలపై అర్చక సమాఖ్య సమావేశంలో చర్చించి తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాల అభివృద్ధి ద్వారా ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్యను గణనీయంగా పెంచుతామన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విజ్ఞప్తి మేరకు కృష్ణానదిపై పలు చోట్ల మంచినీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై విమర్శలకు దిగడం గర్హనీయం, హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ దేవాదాయ శాఖ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత సింహాద్రి సత్యనారాయణరావు అన్నారు. దేవుడు మంత్రిగా పేరుపొందిన ఆయన మన ప్రాంతానికి ఎంతో గుర్తింపు తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారావు, ప్రముఖ వ్యాపార వేత్త కె విద్యాధరరావు, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి శశికాంత్ ఆనంద మహరాజ్, ఆలయ ఇఓ ఆంజనేయ స్వామి, పార్టీ నాయకులు రేపల్లె శ్రీనివాసరావు, బీసాబత్తిన విజయలక్ష్మి, చింతలపూడి బాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 10వేల మందికి పైగా భారీ అన్నసమారాధన నిర్వహించారు.