కృష్ణ

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ సంఘాల పిలుపు మేరకు ఆదివారం స్థానిక బస్ డిపో ఎదుట ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఆదివారం ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కెసీఆర్ నిరంకుశ విధానాలను తీవ్రంగా నిరసించారు. తక్షణమే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే కార్మిక సంఘాలు బుద్ది చెబుతాయని హెచ్చరించారు. ఈ ధర్నాకు ఎంప్లారుూస్ నాయకులు కె రాంప్రసాద్, మహేష్ తదితరులు నాయకత్వం వహించారు.

ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోండి
మైలవరం, అక్టోబర్ 13: స్వచ్ఛంద సంస్థలు అందించే ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) అన్నారు. స్థానిక సర్వీస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎవిస్ ఆసుపత్రి సౌజన్యంతో మైలవరం తాలూకా విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేపీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు స్వచ్చంద సంస్థలు కూడా సమాజ సేవలో ముఖ్యంగా ఉచిత వైద్య సేవలు అందించే విషయంలో భాగస్వామ్యం తీసుకోవటం అభినందనీయమన్నారు. సమాజ సేవలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. విశ్రాంత ఉద్యోగులు, సర్వీస్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి వైద్యులను రప్పించి ఖరీదైన వైద్య సేవలను అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. మానవసేవే మాధవ సేవ అనే సూక్తికి అనుగుణంగా చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. సర్వీస్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ వి రమేష్ బాబు మాట్లాడుతూ ఈశిబిరం ద్వారా 250 మంది రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులు అందించినట్లు తెలిపారు. కాళ్ళలో నరాల వాపు వ్యాధులు తరచూ కొందరికి వస్తున్నాయని ఇది ఖరీదైన వైద్యం అయినందున తమ సంస్థ ద్వారా ఈశిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ ఎవిస్ ఆసుపత్రి వైద్యులు గణేష్‌రుద్ర, సంస్థ మేనేజర్ కిషోర్, స్థానిక వైసీపీ నేతలు పి శ్రీనివాసరావు, లింగాల నిరీక్షణరావు, రహీమ్, కరీమ్ తదితరులు పాల్గొన్నారు.