కృష్ణ

మినుము ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : మినుముల ధరలు క్రమేపి పెరుగుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా యేటా ధరలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి గిట్టుబాటు లేక అప్పుల బారినపడి తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోలు చేసినా అవి కేవలం పచ్చచొక్కాల వారి అభివృద్ధికే పనికి వచ్చాయన్న విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వరుసగా కురిసిన వర్షాలు వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతర దేశాలు నుండి దిగుమతి చేసుకున్న మినుములు మార్కెట్‌కు రాకపోవటంతో, ఈ ఏడాది పంట లేకపోవటంతో స్థానిక వర్తకులు క్రమేపీ ధరలు పెంచుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ రూ.6,500లకు పైగా ధరలు పలుకుతుండటంతో గోదాముల్లో నిల్వ ఉంచిన మినుములను బాగుచేసి ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా మార్చి, ఏప్రిల్ నాటికి తిరిగి మినుము పంట వచ్చే సమయం కాబట్టి ఇప్పటి నుంచే ధరలు పెంచి ఆ సమయానికి తగ్గించే అవకాశ ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో నేటికీ వ్యవసాయ భూములు ముంపునకు గురవుతుండటంతో మినుముల ధరలు క్వింటాల్ రూ.8వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని వర్తకులు పేర్కొంటున్నారు.
గోతులమయమైన కూచిపూడి-మొవ్వ
ఆర్ అండ్ బీ రోడ్డు
కూచిపూడి, అక్టోబర్ 13: మొవ్వ మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారులు గోతులుమయమై మరమ్మతులకు నోచుకోకపోవటంతో వాహనచోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. దశాబ్ధ కాలం కిందట మరమ్మతులు నిర్వహించిన ప్రధాన రహదారులలో తిరిగి ప్యాచ్ వర్కులు కూడా సక్రమంగా చేపట్టకపోవటంతో గోతులమయమయ్యాయి. కూచిపూడి నుండి మొవ్వ వరకు గల ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో ఎక్కడ చూసినా గోతులే తప్ప రోడ్డు కనిపించడం లేదు. ప్రయాణీకులతో పాటు అస్వస్థతకు గురైన రోగులు ఈ రోడ్డు మీద ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల అవనిగడ్డ డిపో ఆర్టీసీ బస్సు ఈ గొయ్యి కారణంగా ముందుగా వెళుతున్న చిన్నకారును ఢీకొంది. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ గొయ్యి వద్ద జరిగిన ప్రమాదంలో ఎవ్వరూ గాయపడకపోవటంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అదే రోజు మోటారు బైక్ తిరగబడి ఇద్దరు బైకిస్టులు గాయపడ్డారు. ఇలా నిత్యం ప్రమాదాలకు గురవుతున్నా ఆర్‌ండ్‌బీ అధికారులు చోద్యం చూస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నుండి చల్లపల్లి వరకు గోతులమయమైన ఆర్‌అండ్‌బీ రహదారిని పూర్తి స్థాయిలో రహదారిని నిర్మించాలని వాహనచోదకులు కోరుతున్నారు.
పగలు ఉక్కపోత.. రాత్రిళ్లు దోమల మోత..
నాగాయలంక, అక్టోబర్ 13: వాతావరణ సమతుల్యత లేకపోవటంతో వేసవి తరుణంలో కాసే ఎండలు ప్రస్తుత వర్షాకాలంలో రావడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాధారణంగా జూన్ నెల మొదలుకుని సెప్టెంబర్ వరకు వర్షాకాలం సమయంలో కురవాల్సిన వానలు అక్టోబర్ ఆరంభం నుంచి అడపాదడపా కురవటం గమనార్హం. అక్టోబర్‌తో మొదలయ్యే శీతాకాలంలో ఈ విధమైన ఎండ తీవ్రత, దీని కారణంగా ఏర్పడే ఉక్కపోతతో మండల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ప్రాంత వ్యవసాయ రంగ మనుగడకు పట్టిసీమ పుణ్యమా అంటూ వ్యవసాయ రంగానికి ఇబ్బందులు లేని పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ సార్వా వరి పైరు బ్రతికేందుకు సాగునీరు ప్రధాన అవసరంగా ఉన్నప్పటికీ పైరు ఎదుగుదల దశలో వర్షాలు కురవకపోవటం వల్ల ఆశించిన దిగుబడి రాదేమోనన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పగటి వేళల్లో ఉక్కపోత, రాత్రి దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తీర గ్రామాలలో అయితే రోజులో అధిక సమయం అప్రకటిత విద్యుత్ కోత కారణంగా గ్రామీణులు దోమల బెడదతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ సమతుల్యత ఎన్నడూ లేని విధంగా లేకపోవటం వల్ల ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భావిస్తున్నారు.