కృష్ణ

పోలీసు అమరవీరుల వారోత్సవాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : పోలీసు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఈ నెల 15వతేదీ నుండి 21వతేదీ వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటంతో పాటు సమాజంలో శాంతిభద్రతల నిర్వహణలో కీలకమైన పోలీసుల పాత్ర, విధులు, వారు చేసే త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఎస్పీ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్ వారీగా వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 15వతేదీన ఓపెన్ హౌస్ పేరు పోలీసు స్టేషన్‌ల నిర్వహణ, ఆయుధాలు, ఆయుధ సంపత్తి గురించి కళాశాల, పాఠశాల విద్యార్థులకు తెలియచేయటంతో పాటు పోలీసుల విధులు, వారు ఎదుర్కొనే సమస్యలు, త్యాగాలకు సంబంధించి చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 16వతేదీన విద్యా సంస్థలలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మంచి సమాజం నిర్మించడానికి ఏ విధంగా పోలీసులు పాటుపడుతున్నారో తెలియచేస్తూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రజల ఆశలు - ఆకాంక్షలు పేరుతో సమాజంలోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి వర్క్‌షాప్, సెమినార్‌లు నిర్వహిస్తామన్నారు. 17వతేదీన యూనిట్ లెవల్‌లో మారధాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 18వతేదీన అన్ని వర్గాల ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ప్రజా స్థలాలలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 19వతేదీన రక్తదాన శిబిరాలు, పోలీసుల త్యాగాల గురించి అవగాహనా సదస్సులు, 20వతేదీన అమరవీరుల త్యాగాలకు నిరసనగా వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరి రోజైన 21వతేదీన జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించడం జరుగుతుందని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
రేపటి నుండి జిల్లాలో గాంధీజీ సంకల్ప పాదయాత్ర
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 13: మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ సంకల్ప పాదయాత్ర ఈ నెల 15వ తేదీ నుండి 31వతేదీ వరకు జిల్లాలో జరగనుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకట గజేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 150కిలో మీటర్ల మేర పాదయాత్ర ఉంటుందన్నారు. 15వతేదీన జగ్గయ్యపేటలో పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, సుజనా చౌదరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా విధిగా హాజరై విజయవంతం చేయాలని గజేంద్ర కోరారు.