కృష్ణ

రాజకీయ ఉనికి కోసమే ‘కొల్లు’ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇసుక కొరత పేరుతో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బూటకపు నిరసన దీక్ష చేపట్టాలని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి రవీంద్ర చేపట్టిన 36గంటల నిరవధిక నిరాహార దీక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరదలు రావటం వల్ల ఇసుక సమస్య ఏర్పడిన మాట వాస్తవమన్నారు. అయితే దీన్ని బూచిగా చూపుతూ రవీంద్ర స్వార్ధ రాజకీయాల కోసం ప్రభుత్వంపై బురద జల్లే విధంగా నిరాహార దీక్ష చేశారన్నారు. రవీంద్ర చేపట్టిన నిరాహార దీక్షలో టీడీపీ కార్యకర్తలు మినహా భవన నిర్మాణ కార్మికులు ఒక్కరు కూడా లేరన్నారు. కనీసం భవన నిర్మాణ కార్మికుల సంఘీభావాన్ని కూడా రవీంద్ర పొందలేకపోయారన్నారు. అప్రజాస్వామికంగా నిర్వహించతలపెట్టిన రవీంద్ర నిరాహార దీక్షను ప్రజలకు తెలియచేసేందుకు తాము కూడా నిరసన దీక్షకు పిలుపునివ్వగా శాంతిభద్రతల సమస్య దృష్ట్యా పోలీసుల సూచనలను పరిగణలోకి తీసుకుని ఇళ్లకే పరిమితమయ్యామన్నారు. కానీ టీడీపీ నేతలు వీధి రౌడీలు మాదిరి వ్యవహరించి పోలీసుల సూచనలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా రోడ్డెక్కారన్నారు. ఫలితంగా పోలీసులు వారి పని వారు చేసుకోవల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కోనేరుసెంటరులో తాము చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేయగా అదే సమయంలో టీడీపీ నేతలు తమ నాయకుడు జగన్మోహనరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారన్నారు. ఆ సమయంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయకుండా తమపై పోలీసులు కేసులు నమోదు చేసి యేడాది పాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. పోర్టు అనుబంధ పరిశ్రమల పేరుతో 33వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి భూదోపిడీకి పాల్పడగా రైతుల పక్షాన పోరాడిన తమ నాయకుడు పేర్ని వెంకట్రామయ్య(నాని)ని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, వైసీపీ నాయకులు తుమ్మలపల్లి జగన్నాథం, రఫీ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం
* జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 13: కుటుంబ బాంధవ్యాలను తెలియచేసే రామాయణ కావ్యాన్ని అందించిన మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ మాట్లాడుతూ మనలోని దుర్గునాలను పక్కన పెట్టి సన్మార్గం వైపు పయనించాలన్నారు. వాల్మీకి జీవితం కూడా దీనే్న సూచిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో ఖాజావలి, బీసీ సంక్షేమాధికారి రబ్బాని, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిథి నెల్సన్ పాల్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.