కృష్ణ

అన్నదాతల అభ్యున్నతే సీఎం జగన్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం : అన్నదాతల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు భరోసా పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం కింద 8,750 కోట్ల రూపాయల నిధులను రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఇటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మైలవరం నియోజకవర్గంలో 27,589 మంది రైతులకు 41.80 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. మొదటి విడతగా 21.55 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. కౌలు రైతులు 1,121 మందికి 1.28 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అది ప్రజల సంక్షేమం కోసమేనన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందన్నారు. ఇటీవల ఆటో డ్రైవర్లకు ఏడాదికి పది వేల రూపాయలు అందించినట్లు తెలిపారు. తాను కూడా రైతు కుటుంబం నుండే వచ్చానని రైతులు పడే కష్టనష్టాలు తనకు తెలుసునన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీటిని నింపినట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే కేపీ ఎడ్ల బండిపై సమావేశానికి వచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సూర్యప్రకాశరావు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఎంపిడిఓ, తహశీల్దార్‌లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.