కృష్ణ

నివేశన స్థలాల పంపిణీకి కసరత్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న అర్హులైన ప్రతి ఒక్క పేద వానికీ ఆవాసం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. రానున్న ఉగాది పర్వదినం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నివేశన స్థల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు అందుబాటులో ఉన్న నివాస యోగ్యమైన ప్రభుత్వ భూములు, ఏ మేర పట్టా భూములు సేకరించాలి, అందుకు ఏ మేర ఖర్చు అవుతుందనే అంశాలపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారులు, అందుబాటులో ఉన్న భూములను గుర్తించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలపై నేటి నుండి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 20వతేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు. గ్రామసభల ద్వారా అర్హుల జాబితాలపై అభ్యంతరాలు తీసుకుని అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించనున్నారు. 21వ తేదీ నుండి 25వతేదీ లోపు అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 1003 గ్రామ, పురపాలక సంఘ వార్డులు ఉండగా లక్షా 81వేల 37 మందితో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు గాను 3వేల 266 ఎకరాల 27 సెంట్ల భూమి అవసరాన్ని గుర్తించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు 1928.42 ఎకరాలు అందుబాటులో ఉంది. మిగిలిన 1337.85 ఎకరాల భూమిని రైతుల నుండి భూసేకరణ చట్టం కింద సేకరించాల్సి ఉంది. భూసేకరణకు రూ.1,373.39 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూ అభివృద్ధికి మరో రూ.154.27 కోట్లు అవసరం ఉంటుందని నివేదికల్లో పేర్కొన్నారు. మొత్తం భూసేకరణ, భూ అభివృద్ధికి రూ.1635.23 కోట్లు నిధుల అవసరం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.