కృష్ణ

వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/కంచికచర్ల/పెనుగంచిప్రోలు : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పోరేట్‌లకు మరింత వేగంగా సంపద పెరుగుతుందని, దేశ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నుండి ప్రజలను కాపాడి ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక సంక్షోబాన్ని నివారించాల్సిన ప్రభుత్వం కార్పోరేట్‌లకు లక్షా 46వేల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. నగేరా పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలుపర్చాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు స్వామినాధన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. నందిగామలో జరిగిన కార్యక్రమంలో వామపక్షాల నాయకులు జరబన నాగేశ్వరరావు, చుండూరు సుబ్బారావు, గోపాల్, గోపినాయక్, ఎసోబు తదితరులు పాల్గొన్నారు. కంచికచర్లలో జరిగిన కార్యక్రమంలో చనుమోలు సైదులు,ఎల్ నాగమల్లేశ్వరరావు, సయ్యద్ ఖాసిం, రాంబాబు, తోట రామారావు, భూషణం తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలులో ప్రధాని మోది దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, వల్లంకొండ బ్రహ్మం, దారా నాగేశ్వరరావు, కన్నయ్య, వేల్పుల కాంతయ్య, కనకపూడి బాబురావు, పిడిమర్తి బాబు, గజ్జి పెద్ది రాజు, తురక కొండలు, గురవయ్య, ఇంటూరి ప్రవీణ్, జక్కులూరి వెంకటేశ్వర్లు, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలం

నందిగామ/కంచికచర్ల, అక్టోబర్ 16: ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని బిజెపి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆరోపించారు. గాంధీజీ సంకల్ప యాత్రలో రెండవ రోజైన బుధవారం జాతీయ రహదారిపై నందిగామ, కంచికచర్ల మీదుగా పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సొమ్ము చెల్లించడంలోనూ సామాజిక వర్గాలు చూడటం మంచి పద్ధతి కాదని అన్నారు. జాతీయ వాదంతోనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. బిజెపిలోనే జాతీయత ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో కేంద్రం, హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొండిగా ముందుకు వెళ్లడం మంచి పరిణామం కాదని అన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.