కృష్ణ

గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : గురుకుల పాఠశాలల్లో అన్ని సౌకర్యాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం పట్టణంలోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పద్మ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల ఉన్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఏ కార్పొరేట్ పాఠశాలకూ తీసిపోని విధంగా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు గురుకులాల్లో విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యాబోధన చేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాల కల్పన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆమె హామీ ఇచ్చారు.

రాష్ట్ర మత్స్యశాఖకు పూర్తి కాలపు కమిషనర్‌ను తక్షణమే నియమించాలి
అవనిగడ్డ, అక్టోబర్ 16: రాష్ట్ర మత్స్యశాఖకు పూర్తి కాలపు కమిషనర్‌ను తక్షణమే నియమించాలని మత్స్యకారుల రాష్ట్ర నాయకుడు, జిల్లా మత్స్యకారుల సంఘం డైరెక్టర్ లకనం నాగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మత్స్యశాఖకు ఇన్‌ఛార్జి కమిషనర్లను నియమించడం వల్ల పరిపాలన సమర్ధవంతంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు పూర్తికాలపు అధికారులను, కమిషనర్లను నియమించిన ప్రభుత్వం రాష్ట్రానికి రూ.35వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని తెస్తున్న మత్స్యశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని, నవంబర్ 21న ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కొన్ని ముఖ్యమైన పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిషనర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.