కృష్ణ

పాత్రికేయుల జీవితాలకు కొరవడిన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తున్న పాత్రికేయులకు ఉద్యోగ భద్రతతో పాటు జీవిత భద్రత కూడా కొరవడిందని పలువురు పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో పాత్రికేయుడు సత్యనారాయణ దారుణ హత్యను నిరసిస్తూ మచిలీపట్నం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు బుధవారం స్థానిక కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ సత్యనారాయణను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను తక్షణమే గుర్తించి వారికి కఠినమైన శిక్ష పడేలా చూడాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

రహదారి భద్రతా నియమాలపై వక్తృత్వ పోటీలు
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు వివిధ అంశాలపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. స్టార్ జూనియర్ కాలేజీ, లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పద్మావతి బీఇడీ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, సార్క్ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం ప్రజ బాధ్యత, పోలీసుల పాత్ర అనే అంశాలపై చిలకలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మోర్ల వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

18న స్కూల్ అసిస్టెంట్స్‌కు
గ్రేడ్-2 హెచ్‌ఎం పదోన్నతి కౌనె్సలింగ్
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 18వతేదీన స్కూల్ అసిస్టెంట్స్ గ్రేడ్-2 ప్రదానోపాధ్యాయులుగా పదోన్నతి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియార్టి జాబితా ఆధారంగా పదోన్నతి కౌన్సిలింగ్ జరుగుతుందని, ఇప్పటికే సీనియార్టి జాబితాలను డీఇఓ కార్యాలయ వెబ్‌సైట్ నందు పొందుపర్చామన్నారు.