కృష్ణ

పోలీసులకు పారదర్శకంగా వారాంతపు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం కల్పించిన వారంతపు సెలవు విధానంలో పారదర్శకత పాటించనున్నట్లు డీజీపీ దామోదర గౌతం సవాంగ్ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనిద్వారా పోలీసు సిబ్బందికి వచ్చే నెలలో తమకు రావాల్సిన వారాంతపు సెలవు గురించి ఈ నెల 25వ తేదీనే తెలుసుకో గలుగుతారన్నారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన 13 జిల్లాల నుంచి హాజరైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఐటీ కోర్ బృందం, సిబ్బందితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా గౌతం సవాంగ్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్ ద్వారా రాష్ట్రంలోని సిబ్బంది ఎప్పుడు ఎవరు సెలవులో ఉంటారో, వెళతారో అనే విషయాన్ని డీజీపీ డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించ గలుగుతారన్నారు. జిల్లాలో ఉన్న సిబ్బంది ఎవరు సెలవులో వెళతారో ఆ జిల్లా అధికారులు పర్యవేక్షించ గలుగుతారని వివరించారు. సమావేశానికి హాజరైన అధికారులు, సిబ్బంది తమకు వారాంతపు సెలవు ఇచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జీ పాలరాజు, ఎస్పీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.